iDreamPost
android-app
ios-app

వీడియో: అందం గురించి కామెంట్లు.. యాంకర్‌పై స్టార్‌ హీరో సీరియస్‌!

  • Published Sep 16, 2023 | 3:48 PM Updated Updated Sep 16, 2023 | 3:48 PM
  • Published Sep 16, 2023 | 3:48 PMUpdated Sep 16, 2023 | 3:48 PM
వీడియో: అందం గురించి కామెంట్లు.. యాంకర్‌పై స్టార్‌ హీరో సీరియస్‌!

ఓ మనిషి అందంగా ఉన్నాడనడానికి.. తెల్ల రంగు ప్రాతిపదికగా తీసుకుంటోంది ఈ  ప్రపంచం. ఇండియాలో అయితే బిడ్డ నల్లగా పుట్టాడంటే చాలు.. తెల్లగా మార్చడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. సినిమా ప్రపంచంలో కూడా హ్యాండ్సమ్‌ హీరో అని తెల్లగా ఉన్న హీరోలకు బిరుదులు ఇచ్చేస్తుంటారు. తాజాగా, స్టార్‌ హీరోల రంగు గురించి మాట్లాడి ఓ యాంకర్‌ ఇబ్బందుల పాలైంది. ప్రముఖ హీరో అశోక్‌ సెల్వన్‌ తనను అందంగా ఉన్నావని పొగిడినా సరే.. ఆ స్టార్‌ హీరోలను రంగు గురించి మాట్లాడినందుకు యాంకర్‌పై సీరియస్‌ అయ్యాడు.

ఈ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ తమిళ హీరో అశోక్‌ సెల్వన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఆ ఇంటర్వ్యూలో అందం గురించిన ప్రస్తావన వచ్చింది. యాంకర్‌కు హీరోకు మధ్య సంభాషణ ఇలా ఉంది.

యాంకర్‌ : మీరు చూడ్డానికి అందంగా, హ్యాండ్సమ్‌గా ఉన్నారు. కానీ, తమిళ ఇండస్ట్రీలో మాత్రం బాయ్‌ నెక్స్‌డోర్‌ అంటేనే ఇష్టంగా మారింది. ధనుష్‌ కావచ్చు.. విజయ్‌ సేతుపతి కావచ్చు.. వాళ్లు మన పక్కింటి వాళ్లలా ఉంటారు. మీరు మీ అందాన్ని ప్లస్‌ అనుకుంటున్నారా? మైనస్‌ అనుకుంటున్నారా?
హీరో : లేదండీ.. దేన్ని బట్టి మీరు అందం అని అంటున్నారు. నాకంటికి ధనుష్‌ సార్‌, విజయ్‌ సేతుపతి సార్‌ ఎక్స్‌ట్రార్డనరీగా కనిపిస్తున్నారు.
యాంకర్‌ : నేను వాళ్లను తగ్గించి మాట్లాడటం లేదు.
హీరో : అందం అనేది ఓ పర్‌సెప్చన్‌ మాత్రమే.
యాంకర్‌ : రంగు..
హీరో : ఏం రంగు..
యాంకర్‌ : తెల్లగా ఉన్నారు కదా..
హీరో : తెల్లగా ఉంటే.. తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్లా..
యాంకర్‌ : లేదండి.. తెల్ల రంగు బట్టే అందంగా ఉన్నారని అనుకుంటున్నారు కదా..
హీరో : తెల్లగా ఉంటే అందంగా ఉన్నారని.. నల్లగా ఉంటే అందంగా లేరని అనుకోవటం తప్పు.. అంటూ యాంకర్‌పై సీరియస్ అయ్యారు. మరి, అందం అంటే రంగు అని మాట్లాడిన యాంకర్‌పై హీరో సీరియస్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabet