iDreamPost
android-app
ios-app

ఓ ఇంటి వాడు కాబోతున్న హీరో.. ఆ ప్రముఖ నటితో త్వరలో పెళ్లి!

ఓ ఇంటి వాడు కాబోతున్న హీరో.. ఆ ప్రముఖ నటితో త్వరలో పెళ్లి!

అశోక్‌ సెల్వన్‌.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్‌ సినిమాలతో తరచుగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటారు. అంతేకాదు! ఆయన ఓ తెలుగు సినిమాలోనూ నటించారు. 2021లో వచ్చిన ‘నిన్నిలా.. నిన్నిలా’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తర్వాత 2022లో వచ్చిన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’సినిమాలో గెస్ట్‌ అప్ఫియరెన్స్‌ ఇచ్చారు. 2023 ‘పోర్‌ తొలిల్‌’ అనే డబ్బింగ్‌ సినిమాతో తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అశోక్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆయన త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. అశోక్‌ ప్రముఖ నటి కీర్తి పాండియన్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ రిలేషన్‌ను తర్వాతి స్టేజికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలో కీర్తితో ఆయన పెళ్లి జరగబోతోందని సమాచారం. సెప్టెంబర్‌ నెలలోనే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారట. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు. అశోక్‌ సెల్వన్‌ నుంచికానీ, కీర్తి పాండియన్‌ నుంచి కానీ, ఓ అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వీటిని పుకార్లుగానే భావించాల్సి ఉంటుంది.

కాగా, కీర్తి పాండియన్‌ 2019లో వచ్చిన ‘తుంబ’ అనే తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం ‘కొంచెం పేసినాల్‌ ఎన్న’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. కీర్తి సినిమాల్లోనే ఓ సీరియల్‌లోనూ నటించింది. పోస్ట్‌మ్యాన్‌ అనే సీరియల్‌లో ఓ కీలక పాత్ర చేసింది. చేసింది కొన్ని సినిమాలు, సీరియళ్లు అయినా.. తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. మరి, అశోక్‌ సెల్వన్‌, కీర్తి పాండియన్‌ పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş