iDreamPost
android-app
ios-app

Arti Singh: వ్యాపార వేత్తతో బుల్లితెర నటి వివాహం! దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోయింది!

  • Published Apr 26, 2024 | 1:30 PM Updated Updated Apr 26, 2024 | 1:30 PM

సినీ పరిశ్రమలో బ్యూటీలంతా వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాప్సీ, రకుల్ ప్రీత్, కృతి కర్భంద, అపర్ణా దాస్ మూడు ముళ్ల బంధంలోకి ఎంటర్ అయ్యారు. తాజాగా మరో బుల్లితెర నటి కూడా పెళ్లి చేసుకుంది.

సినీ పరిశ్రమలో బ్యూటీలంతా వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాప్సీ, రకుల్ ప్రీత్, కృతి కర్భంద, అపర్ణా దాస్ మూడు ముళ్ల బంధంలోకి ఎంటర్ అయ్యారు. తాజాగా మరో బుల్లితెర నటి కూడా పెళ్లి చేసుకుంది.

  • Published Apr 26, 2024 | 1:30 PMUpdated Apr 26, 2024 | 1:30 PM
Arti Singh: వ్యాపార వేత్తతో బుల్లితెర నటి వివాహం! దెబ్బకి  లైఫ్ సెటిల్ అయిపోయింది!

ఇండస్ట్రీలోని ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొంత మంది ఎర్లీగా పెళ్లి చేసుకుంటుంటే.. మరికొంత మంది 30 ప్లస్ వచ్చాక వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. టాలీవుడ్‌లో తమ నటనతో మెస్మరైజ్ చేసి.. బాలీవుడ్ చెక్కేసిన హీరోయిన్లు.. సొట్ట బుగ్గుల సుందరి తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బందా ఇటీవలే తాము ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నారు. వీరంతా కూడా 30 ప్లస్ ఏజ్‌లోనే వివాహం చేసుకున్నారు. కాగా, ఆదికేశవ బ్యూటీ అపర్ణా దాస్ కూడా ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. 28 ఏళ్ల వయస్సులో మంజుమ్మల్ బాయ్స్ హీరో దీపక్ పరంబోల్‌ను వివాహమాడింది. ఇప్పుడు మరో నటి..లేటు వయస్సులో పెళ్లి చేసుకుంది.

బుల్లితెర నటి ఆర్తి సింగ్  పెళ్లి చేసుకుంది. బిజినెస్ మెన్ దీపక్ చౌహాతో మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. ముంబయిలోని జుహులోని ఇస్కాన్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సిగ్గుల మొగ్గైంది ఆర్తి. తెల్లటి షేర్వాణి ధరించి, తలకు తెల్లటి టోపీతో వరుడు ముస్తాబు కాగా, ఎరుపు రంగు గాగ్రాతో మెరిసిపోయింది నటి ఆర్తి. ప్రస్తుతం పెళ్లి వేదిక మీదకు వీరిద్దరు వస్తున్న ఎంట్రీ వీడియోస్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. దీపక్ గుర్రపు స్వారీ చేసుకుంటూ.. రాజులా మండపానికి వచ్చాడు. అలాగే అతడు వేదిక వద్దకు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆర్తి సంతోషం, సిగ్గుతో కూడిన భావోద్వేగాలతో కనిపించింది.

ఇక వీరి పెళ్లికి బుల్లితెర, వెండితెర నటులు హాజరయ్యి, వధూవరులను ఆశీర్వదించారు. విక్కీ జైన్-అంకిత లోఖండే, యువిక చౌదరి, కరణ్ సింగ్ గ్రోవర్- బిపాషా బసు, రష్మీ దేశాయ్ తదితరులు హాజరయ్యారు. ఆర్తి సింగ్ బుల్లితెరపై అనేక ధారావాహికల్లో నటించింది. మాయ్క అనే సీరియల్ తో టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 13లో కూడా పాల్గొంది. తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంది. నాల్గవ రన్నరప్ గా నిలిచింది. అవే కాకుండా మూడు, నాలుగు సినిమాల్లో కూడా నటించింది ఈ బుల్లితెర బ్యూటీ.  39 ఏళ్ల వయస్సులో ఈ బాలీవుడ్ నటి పెళ్లి పీటలు ఎక్కింది. ఇక దీపక్ చౌహాన్ విషయానికి వస్తే.. స్టార్ కనక్ట్ గ్రూప్ ఎండీగా వ్యవహరిస్తున్నాడు. దీంతో దెబ్బకు ఆమె లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అంటున్నారు నెటిజన్లు

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet