iDreamPost
android-app
ios-app

అర్జున్ ఇంట పెళ్లి సందడి.. వైరలవుతున్న హల్దీ పిక్స్!

  • Published Jun 08, 2024 | 10:17 PM Updated Updated Jun 08, 2024 | 10:17 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తన కూతురు, హీరోయిన్ ఐశ్వర్య హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తన కూతురు, హీరోయిన్ ఐశ్వర్య హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

అర్జున్ ఇంట పెళ్లి సందడి.. వైరలవుతున్న హల్దీ పిక్స్!

సెలబ్రిటీల ఇళ్లలో చిన్న చిన్న వేడుకలనే ఎంతో ఘనంగా చేస్తారు. అలాంటిది పెళ్లంటే ఇంకెంత హడావిడి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి హడావిడే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో నెలకొంది. ఆయన ఇంట్లో పెళ్లి సందడి మెుదలైంది. అర్జున్ పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి పీటలెక్కనుంది. యంగ్ హీరోతో చెన్నైలో ఐశ్వర్య వివాహం జరగబోతోంది. దాంతో పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్జున్ పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య వివాహం జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో తంబి రామయ్య కొడుకు, యంగ్ హీరో ఉమాపతితో జరగనుంది. వివాహ కార్యక్రమంలో భాగంగా హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. వీరిది లవ్ మ్యారేజ్. ఐశ్వర్య-ఉమాపతిలు ప్రేమించుకున్నారు. ఆ విషయాన్ని పెద్దలకు చెప్పడం.. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది.

ఇక వాళ్ల కెరీర్ విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా సాగడంలేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్ గా మారినా కూడా ఫలితం లేదు. విశ్వక్ సేన్-ఐశ్వర్య జంటగా అర్జున్ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ మూవీ షూటింగ్ కు వెళ్లకముందే ఆగిపోయింది. మరోవైపు ఉమాపతి మనియార్ కుటుంబం, తిరువనం, థానే వాడి, అడగప్పట్టత్తు మగజనంగళే లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. త్వరలోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)