iDreamPost
android-app
ios-app

రెండోసారి తల్లైన ఊపిరి నటి.. 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రైన నటుడు!

రెండోసారి తల్లైన ఊపిరి నటి.. 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రైన నటుడు!

కింగ్ నాగార్జున- కార్తీ నటించిన ఊపిరి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక పది నిమిషాల ప్లాట్ లో ఒక బ్యూటీ తళుక్కుమంది. నాగార్జున ఆమెకు బొకేలు పంపి ఇంప్రెస్ చేస్తాడు. ఆ బ్యూటీ గుర్తుందా? ఆమె ఎవరో కాదు.. దక్షిణాఫ్రికాకి చెందిన గాబ్రియెల్లా. ఆమె బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తో రిలేషన్ లో ఉంది. వీరికి 2019లోనే 2018లో ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీళ్లు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారి ప్రేమకు గుర్తుగా 2019లో అరిక్ రాంపాల్ అనే కొడుకు పుట్టాడు.

తాజాగా గాబ్రియెల్లా మరో బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో గాబ్రియెల్లా పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అయింది. అలాగే అర్జున్ రాంపాల్ 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి అయ్యాడు. అర్జున్ రాంపాల్ కు గతంలో మెహర్ జెసియాతో వివాహం జరగ్గా.. వారికి మహికా రాంపాల్, మైరా రాంపాల్ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీళ్లు 2019లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత అర్జున్ రాంపాల్- గాబ్రియెల్లా రిలేషన్ లోకి వెళ్లారు. తాను నాలుగోసారి తండ్రైన విషయాన్ని అర్జున్ రాంపాల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు.

 

View this post on Instagram

 

A post shared by Arjun Rampal (@rampal72)

“ఈరోజు నేనూ- నా కుటుంబం ఒక అందమైన బిడ్డకు స్వాగతం పలికాం. ప్రస్తుతం తల్లీకొడుకులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా, అద్భుతంగా సేవలు అందించిన వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు” అంటూ అర్జున్ రాంపాల్ చెప్పుకొచ్చారు. ఈ పోస్టు చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అర్జున్ రాంపాల్- గాబ్రియెల్లాకు కామెంట్స్ ద్వారా తమ శుభాకాంక్షలను తెలియజేశారు. అర్జున్ రాంపాల్ చివరిగా కంగనా రనౌత్ తో కలిసి ధాకడ్ సినిమాలో నటించాడు. అర్జున్ రాంపాల్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని ఇన్ స్టాగ్రామ్ ఖాతా చూస్తే అర్థమవుతుంది. అన్నీ తన కుమార్తెలు, కుమారుడు, ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి ఉన్న ఫొటోలు, రీల్స్ కనిపిస్తూ ఉంటాయి. రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చిన తర్వాత మరి ఇప్పటికైనా వివాహం చేసుకుంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Arjun Rampal (@rampal72)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet