Swetha
అర్జున్ దాస్ తీసిన సినిమాలు తక్కువే. కానీ ఆయనకు ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అతని బేస్ వాయిస్ కు పీక్ ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా ఇతని వాయిస్ కోసం అడుగుతున్నారంటే ఆ వాయిస్ కు ఎంత రీచ్ ఉందొ అర్థంచేసుకోవచ్చు.
అర్జున్ దాస్ తీసిన సినిమాలు తక్కువే. కానీ ఆయనకు ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అతని బేస్ వాయిస్ కు పీక్ ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా ఇతని వాయిస్ కోసం అడుగుతున్నారంటే ఆ వాయిస్ కు ఎంత రీచ్ ఉందొ అర్థంచేసుకోవచ్చు.
Swetha
అర్జున్ దాస్ తీసిన సినిమాలు తక్కువే. కానీ ఆయనకు ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అతని బేస్ వాయిస్ కు పీక్ ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా ఇతని వాయిస్ కోసం అడుగుతున్నారంటే ఆ వాయిస్ కు ఎంత రీచ్ ఉందొ అర్థంచేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాదు.. విలన్ రూపంలో ఇమ్రాన్ హష్మీతో పాటు ఇతను కూడా ఓజిలో కనిపించబోతున్నాడు. సో కచ్చితంగా ఓజి అర్జున్ దాస్ కు పెద్ద బ్రేక్ ఇస్తుందని అంతా అనుకుంటున్నారు.
అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీలో విలన్ గా డ్యూయల్ రోల్ చేసి మెప్పించడంతో… ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు తలుపు తడుతున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రానున్న డాన్ 3లో విలన్ గా అర్జున్ దాస్ నే అనుకుంటున్నారట. ప్రస్తుతానికి సినిమా ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే ఉంది కానీ. ఒకవేళ అర్జున్ దాస్ కనుక డాన్ 3కి ఎంపికైతే బాలీవుడ్ లో జెండా పాతేయొచ్చు. విలన్ కు ముందు ముందు మంచి రోల్స్ సంపాదించుకోడానికి ఓ మంచి స్కోప్ దొరుకుతుంది.
అసలే అక్కడ విలన్స్ తక్కువ ఉంటారు. సో అర్జున్ దాస్ దశ తిరిగినట్టే. తెలుగులో అయితే ఇప్పటివరకు చేసిన సినిమాలు తక్కువే. అప్పుడెప్పుడో ఆక్సిజన్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ బుట్టబొమ్మలోనే కనిపించాడు. రెండు సరిగా ఆడలేదు కానీ అర్జున్ దాస్ కు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా తెలుగు తమిళ డబ్బింగ్ మూవీస్ మాస్టర్, విక్రమ్, ఖైదీ ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఓజి రూపంలో బ్లాక్ బస్టర్ అయితే అర్జున్ దాస్ విలన్ గా సెటిల్ అయిపోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.