iDreamPost
android-app
ios-app

ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు.. ఆపరేషన్ చేయనున్నారంటూ

  • Published Mar 09, 2024 | 4:04 PM Updated Updated Mar 09, 2024 | 4:04 PM

ప్రముఖ నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అతడు పోస్టు చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

ప్రముఖ నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అతడు పోస్టు చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

  • Published Mar 09, 2024 | 4:04 PMUpdated Mar 09, 2024 | 4:04 PM
ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు.. ఆపరేషన్ చేయనున్నారంటూ

గతంలో సోషల్ మీడియా లేకపోడంతో సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం తింటారు, ఏ షూటింగ్‌లో పాల్గొంటున్నారనే విషయాలు తెలిసేవి కావు. కానీ నేటి కాలంలో వారి మరణ వార్తలు సైతం వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే తెలుస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ప్రముఖ నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. ప్రముఖ బాలీవుడ్ టీవీ సీరియల్ నటుడు అర్జున్ బిజ్లానీ అపెండిసైటిస్ బారిన పడ్డాడు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో శుక్రవారం ఆసుపత్రిలో చేరాడు. శనివారం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చారు అర్జున్. ‘తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. ఎక్స్ రే తీయించుకోగా.. అప్రెంటిసైటిస్ అని తేలింది. రేపు ఉదయం శస్త్రచికిత్స చేయబోతున్నారు’ అని మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. అభిమానులు ఆందోళన చెందవద్దని, త్వరగా కోలుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు హిందూజ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలోలు పంచుకున్న ఆయన ‘అంతా మన మంచికే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. అతడి చేతికి కాన్యులా కనిపించింది. అటు సీరియల్స్, రియాలిటీ షోతో టీవీ పాపులర్ అయ్యాడు ఈ నటుడు.

The actor was hospitalized

తెలుగు వారికి కూడా సుపరిచితమే. తెలుగు నాట విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నాగిని సీరియల్లో నటించాడు. మిలే జబ్ హమ్మ, తుమ్‌తో మరింత పేరును తెచ్చిపెట్టాయి. ఎక్కువగా రియాలిటీ షోల్లో పాల్గొంటాడు అర్జున్. ఫియర్ ఫ్యాక్టర్ సీజన్ 11 విన్నర్‌గా నిలిచాడు. ఇవే కాదూ.. పలు సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. అలియా భట్, రణవీర్ సింగ్ రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ సినిమాలో గెస్ట్ రోల్లో మెరిశాడు. ఇక రియాలిటీ షో బిగ్ బాస్, సహా పలు ధారావాహికల్లో కూడా అతిధి పాత్రల్లో కనిపించాడు. రెండు వెబ్ సిరీస్‌లతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటించాడు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş