iDreamPost
android-app
ios-app

Anuya: ఆ హీరోలతో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన అనూయ!

  • Published Dec 10, 2023 | 1:53 PM Updated Updated Dec 10, 2023 | 1:53 PM

నటి అనూయ తీసింది కొన్ని సినిమాలే అయినా... తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2014 తర్వాత ఆమె కెరీర్‌ గాడి తప్పింది...

నటి అనూయ తీసింది కొన్ని సినిమాలే అయినా... తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2014 తర్వాత ఆమె కెరీర్‌ గాడి తప్పింది...

  • Published Dec 10, 2023 | 1:53 PMUpdated Dec 10, 2023 | 1:53 PM
Anuya: ఆ హీరోలతో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన అనూయ!

చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారిపై పుకార్లు రావటం అన్నది సర్వసాధారణం. వారి ప్రమేయం ఉన్నా లేకపోయినా.. పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల గురించి. నిజా,నిజాలు తెలియకుండానే ఎఫైర్లు కట్టబెడుతుంటారు. వీటిలో నూటికి 90 శాతం పుకార్లే ఉంటున్నాయి. ఆ పుకార్ల కారణంగా హీరోయిన్ల వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడుతూ ఉంటుంది. కుటుంబసభ్యులు, బంధు మిత్రుల దగ్గర లేని వాటికి కూడా సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుంది. సోషల్‌ మీడియాలో రాసే చెడు వార్తల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సోషల్‌ మీడియా చెడు రాతల కారణంగా నటీమణుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. కొంతమంది ఈ రాతల్ని లైట్‌గా తీసుకుంటుంటే.. మరికొంతమంది ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా, ప్రముఖ తమిళ నటి ఆనూయ తనపై వస్తున్న పుకార్లకు స్వయంగా ఆమే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. కొంతమంది హీరోలతో ఆమెకు సంబంధం ఉందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అనూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మాట్లాడుతూ..

‘‘ నేను దుబాయ్‌లో పుట్టి పెరిగాను. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. నాకు సంబంధం లేకపోయినా.. విజయ్‌ ఆంటోనీ, సుందర్‌ సీ, జీవాలతో నన్ను కలుపుతూ పుకార్లు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను. అవన్నీ తప్పుడు ప్రచారాలే. ఆ ప్రచారాల్లో వాస్తవాలు లేవు కాబట్టే.. నేను పెద్దగా పట్టించుకోవటం లేదు. నేను ఇప్పటికీ సింగిల్‌నే’’ అని అన్నారు. ఓ అభిమాని వెంటనే.. ‘‘ ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు? పెళ్లి చేసుకోవచ్చుకదా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు అనూయ సమాధానం ఇస్తూ.. ‘‘ నా చుట్టూ మంచి మగవాళ్లు ఎవరూ లేరు’’ అని అన్నారు.

ఇక, అనూయ క్లారిటీ ఇవ్వటంతో గత కొంత కాలంగా ఆమెపై సాగుతున్న ప్రచారానికి తెరపడినట్లు అయింది. కాగా, అనూయ భగత్‌ అలియాస్‌ అనూయ 2007లో వచ్చిన మహేక్‌ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2009లో వచ్చిన ‘‘శివ మనసుల శక్తి’’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో ఎస్‌ఎమ్‌ఎస్‌గా రీమేక్‌ అయింది. 2012 వరకు తమిళంలో వరుస సినిమాలు చేశారు. తర్వాత అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి.

2014లో ఓ బెంగాళీ, ఓ హిందీ చిత్రాల్లో నటించారు. అనంతరం అవకాశాలు లేకపోవటంతో వెండి తెరకు దూరం అయ్యారు. బుల్లితెరపై కొన్ని షోలు కూడా చేశారు. 2018లో ‘‘సావధాన్‌ ఇండియా’’ టీవీ సిరీస్‌లో కనిపించారు. మరి, హీరోలతో సంబంధంపై నటి అనూయ క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş