iDreamPost
android-app
ios-app

అరుంధతిని మించిన పాత్రలో అనుష్క! ఈసారి బాక్సాఫీస్ షేక్ పక్కా!

  • Published Mar 12, 2024 | 5:08 PM Updated Updated Mar 12, 2024 | 5:35 PM

Anushka Shetty New Movie: అనుష్క శెట్టి ఇన్నేళ్ల తర్వాత మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఆ సినిమా అలా ఇలా కాదు.. ఒక రేంజ్ లో ఉండబోతోందని చెబుతున్నారు.

Anushka Shetty New Movie: అనుష్క శెట్టి ఇన్నేళ్ల తర్వాత మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఆ సినిమా అలా ఇలా కాదు.. ఒక రేంజ్ లో ఉండబోతోందని చెబుతున్నారు.

  • Published Mar 12, 2024 | 5:08 PMUpdated Mar 12, 2024 | 5:35 PM
అరుంధతిని మించిన పాత్రలో అనుష్క! ఈసారి బాక్సాఫీస్ షేక్ పక్కా!

అనుష్క శెట్టి.. పాన్ ఇండియా లెవల్లో ఈమెకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరోకి సరిసమానంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ స్వీటీ ఇన్నేళ్ల సినిమా కెరీర్ తర్వాత మలయాళంలో తొలి సినిమా చేయబోతోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కేరళలో ఆ మూవీకి సంబంధించి మంచి బజ్ ఏర్పడింది. అంతేకాదు.. ఆ మూవీ స్టోరీ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వార్తలు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఎందుకంటే అనుష్క కెరీర్ లో అరుధంతి మూవీకి మించి ఉంటుంది అంటున్నారు.

అనుష్క టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయన్ గా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. తన కెరీర్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. వాటిలో అరుంధతి మూవీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా అరుంధతి నిలిచింది. ఆ మూవీలో అనుష్క యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు ఆమె కెరీర్లో అంతకు మించిన సినిమాతో వస్తోంది అంటున్నారు. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో తాను సినిమా చేయబోతోంది అనే విషయాన్ని ప్రకటించారు. మలయాళంలో ఇది స్వీటీ డెబ్యూ మూవీ. ఈ కథనర్ మూవీని అంత తక్కువ అంచనా వేయడానికి లేదు అంటున్నారు. ఈ మూవీకి సంబంధించి చాలానే కథలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక స్టోరీ ప్రచారంలోకి వచ్చింది.

Anu

కథ ఏంటంటే.. కథనర్ అంటే 9వ శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథ అంటున్నారు. ఇతని హయాంలోనే కల్లియన్ కట్టు నీలి అనే యువతి ఉండేది. ఈ పాత్రలోనే అనుష్క చూడబోతున్నాం అంటున్నారు. ఆమె అందం గురించి ట్రావెన్ కోర్ జానపదాల్లో ఎన్నో కథలు, పాటలు ఉన్నాయి. అసలు నీలి ప్రస్తావన లేకుండా పాటలు కూడా పాడరు అంట. అలాగే కల్లియన్ కట్టు నీలికి సంబంధించి బోలెడు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే నీలి పాత్రకు సంబంధించి కేరళ సాహిత్యంలో ఎన్నో ఆధారాలు, మరెంతో కంటెంట్ కూడా ఉంది. వింటే గూస్ బంప్స్ తెప్పించే ఎన్నో సంఘటనలు, మలుపులు ఉంటాయి. వాటి ఆధారంగానే డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ కథనర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఈ నీలి ఒక దేవదాసి కుమార్తె అంట. అయితే ఆమె కుటుంబంలో జరిగిన అనుకోని సంఘటనలు, ఆమెపై జరిగిన చేతబడుల కారణంగా నీలి ఆత్మ మారుతుంది అని చెప్తున్నారు. ఇక్కడే ఒక మంచి సినిమాకి కావాల్సిన స్కోప్ కూడా ఉంటుంది. పైగా నీలికి కడమత్తుకు ఉన్న సంబంధం ఏంటి అనే పాయింట్ ని కూడా బాగా హైలెట్ చేయచ్చు. ఇక్కడ ఇంకో పుకారు కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. కథనర్ మొత్తం రెండు పార్టులుగా రాబోతోంది అంటున్నారు. మొదటి పార్టులో కావాల్సినన్ని ట్విస్టులు, మలుపులు, వెన్నులో వణుకుపుట్టే సంఘటనలు ఉంటాయి అంటున్నారు. ఇంక రెండో పార్ట్ అయితే అంతకు మించే ఉంటుందంట. ఈ నీలి పాత్ర చూస్తే అరుంధతికి మించే ఉంటుంది అంటున్నారు. ఇదంతా అధికారిక సమాచారం కాకపోయినా.. చిత్ర బృందం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. మరి.. దెయ్యం పాత్రలో అనుష్క కనిపించబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş