iDreamPost
android-app
ios-app

విడాకులు తీసుకున్న మరో సెలబ్రెటీ జంట! అందుకేనా?

  • Published Feb 22, 2024 | 3:53 PM Updated Updated Feb 22, 2024 | 3:53 PM

Divorced Celebrity Couple: ఈ మద్య కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు.. వీరి జాబితాలో మరో జంట చేరింది.

Divorced Celebrity Couple: ఈ మద్య కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు.. వీరి జాబితాలో మరో జంట చేరింది.

  • Published Feb 22, 2024 | 3:53 PMUpdated Feb 22, 2024 | 3:53 PM
విడాకులు తీసుకున్న మరో సెలబ్రెటీ జంట! అందుకేనా?

వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీలో చాలా వరకు తమ నటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతకాలం లివింగ్ రిలేషన్ లో ఉంటూ పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటున్నారు.  వేదమంత్రాల సాక్షిగా.. పెద్దల సమక్షంలో కలకాలం కలిసి ఉంటామని మూడు ముళ్ల బంధంతో ఏమైన జంట కొద్దికాలంలోనే విడిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మాలీవుడ్ సెలబ్రెటీ జంట చేరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమే అని తేలిపోయింది. ఇంతకీ ఆ జంట ఎవరు..? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? అన్న విషయం గురించి తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో ఇటీవల ప్రేమ.. పెళ్లి.. కొంతకాలనికే విడాకులు సర్వసాధారణమైయ్యాయి. కలకాలం కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటున్న జంటలు కొద్దికాలంలోనే విడిపోతున్నారు. ఈ జాబితాలోకి వచ్చి చేరారు మాలీవుడ్ జంట జిషన్ మోహన్-వరద. మొన్నటి వరకు ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని అక్కడ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఇది నిజమే అని ధృవీకరించారు నటుడు జిషన్. తాము విడిపోయామని.. విడాకులు తీసుకున్నామని ప్రకటించారు. ఈ సందర్బంగా జిషన్ మోహన్ మాట్లాడుతూ.. ‘ ఈ మధ్య ఓ సీరియల్ నటిని పెళ్లాడినట్లు వస్తున్న వార్తలో నిజం లేదు.. భగవంతుడి దయవల్ల నేను సీరియల్స్ లో బిజీగా ఉన్నాను.. పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నా జీవితంలో ఏం జరిగిందో నేను పట్టించుకునే బాధపడను’అని అన్నాడు.

నటి వరద సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నిన్న నవ్వాను.. ఈరోజూ నవ్వుతూనే ఉన్నాను.. రేపు కూడా నవ్వుతూనే ఉంటాను. ప్రతి మనిషి జీవితం చాలా చిన్నది.. కన్నీరు పెడుతూ గడపడం జీవితం కాదు..’ అంటూ రాసుకొచ్చింది. ఈ జంట వ్యాఖ్యలు.. పోస్టులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల వీరి మద్య కొన్ని విషయాల్లో అపోహలు, అభిప్రాయభేదాలు రావడమే విడాకులకు కారణం అని ఇండస్ట్రీ టాక్. ‘అమల’ అనే సీరియల్ లో వరద హీరోయిన్, జిషిన్ విలన్ గా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి 2014 లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు పుట్టాడు. లవింగ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఇలా విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet