iDreamPost
android-app
ios-app

Animal: యానిమల్ సునామీ.. 3వ రోజు కలెక్షన్ ఎంతంటే..?

  • Published Dec 04, 2023 | 1:34 PM Updated Updated Dec 04, 2023 | 1:34 PM

యానిమల్ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. రణబీర్ కూడా ఊహించని రెస్పాన్స్ వస్తుంది ప్రేక్షకుల నుండి. థియేటర్లన్నీ ఫుల్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బీటౌన్ ఇండస్ట్రీకి యానిమల్ రూపంలో మరో భారీ విజయాన్ని అందించాడు.

యానిమల్ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. రణబీర్ కూడా ఊహించని రెస్పాన్స్ వస్తుంది ప్రేక్షకుల నుండి. థియేటర్లన్నీ ఫుల్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బీటౌన్ ఇండస్ట్రీకి యానిమల్ రూపంలో మరో భారీ విజయాన్ని అందించాడు.

  • Published Dec 04, 2023 | 1:34 PMUpdated Dec 04, 2023 | 1:34 PM
Animal: యానిమల్ సునామీ.. 3వ రోజు కలెక్షన్ ఎంతంటే..?

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు బీటౌన్ సెన్సేషన్. ఆ సినిమా ఏంటీ, ఆ రికార్డులు ఏంటీ అని బాలీవుడ్ సినీ ప్రముఖులు, విశ్లేషకులు, మీడియా అచ్చెరవు చెందుతున్నారు. ఎందుకంటే రికార్డులు మోత మోగించాలంటే ఓన్లీ త్రీ ఖాన్స్‌కు మాత్రమే సాధ్యం. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురు మాత్రమే బాక్సాఫీసును దున్నేస్తుంటారు. వారికి వారే పోటీ.. వారికి లేదు సాటి అన్నట్లుగా కలెక్షన్లను కుమ్మేస్తుంటారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి నటులు ..అలాంటి ఫీట్స్‌ను అరుదుగా సాధిస్తుంటారు. అలాంటిది ఓ యంగ్ హీరో మూవీకి కాసుల వర్షం కురుస్తుందంటే కళ్లు తేలేస్తున్నారు బీటౌన్ సెలబ్రిటీస్. అందుకు కారణమయ్యాడు డైరెక్టర్ సందీప్.

యానిమల్ మూవీ విడుదలైన తొలి రోజు నుండే గల్లా పెట్టి ఫుల్ అయ్యింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 200 కోట్ల కలెక్షన్లు దాటి పోయింది. మొదటి రోజు ఇండియాలోనే సుమారు రూ. 60 నుండి రూ. 70 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా రూ. 116 కోట్లను కొల్లగొట్టింది. ఇక వీకెండ్ కావడంతో శనివారం థియేటర్లు ఫుల్ అయిపోయాయి. ఇండియాలోనే 68 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో 236 కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంది. దీంతో రెండు రోజుల్లోనే అరుదైన ఫీట్ సాధించాడు రణబీర్. ఇక మూడవ రోజైన ఆదివారం కూడా ఆ మూవీ రోరింగ్ ఆగలేదు. కాసుల కుంభ వృష్టి కురిసింది. మూడు రోజుల్లో 300 కోట్లను దాటేసింది.

ఆదివారం ఇండియాలో ఈ మూవీ రూ. 72. 50 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు రోజుల్లోనే భారత్ వైడ్‌గా రూ. 202 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 356 కోట్లను కొల్లగొట్టింది. అలాగే సోమవారం కూడా అంటే నాల్గవ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ భారీ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రూ. 500 కోట్ల రూపాయాలపై కన్నేసినట్లు కనబడుతోంది. మొత్తానికి ఈ సినిమా భారీ వసూళ్లను చేయడం ఖాయమని మూవీ ఎక్స్ పర్ట్స్ చెప్పుకుంటున్నారు. ఇక ఈ పిక్చర్ విషయానికి వస్తే రణబీర్ కపూర్, రష్మిక, బాబీడియోల్, అనిల్ కపూర్, బబ్లూ ఫృద్వీ రాజ్ తదితరులు నటించిన సంగతి విదితమే. టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom