iDreamPost
android-app
ios-app

‘యానిమల్’ విలన్ ’కంగువ’లో మరింత భయంకరంగా

  • Published Jan 27, 2024 | 1:49 PM Updated Updated Jan 27, 2024 | 1:59 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య నుండి రాబోతున్న చిత్రం కంగువ. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేసింది చిత్ర యూనిట్.. ఇప్పుడు...

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య నుండి రాబోతున్న చిత్రం కంగువ. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేసింది చిత్ర యూనిట్.. ఇప్పుడు...

  • Published Jan 27, 2024 | 1:49 PMUpdated Jan 27, 2024 | 1:59 PM
‘యానిమల్’ విలన్ ’కంగువ’లో మరింత భయంకరంగా

వర్సటైల్ యాక్టర్ సూర్య నుండి రాబోతున్న అప్ కమింగ్ మూవీ కంగువ. సూర్య కెరీర్ లో పెద్ద బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది. పీరియాడిక్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రంలో సూర్య డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని జపనీస్, కొరియన్‌తో సహా 38 భాషల్లో విడుదల చేస్తుండటం విశేషం. ఐ మ్యాక్స్, 3డీ వెర్సన్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్నట్లు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ మూవీతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన బాబీ డియోల్.. ఈ సినిమాలో కూడా ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, ఆనంద్ రాజ్ ఇతర పాత్రధారులు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి సమయంలో సూర్య సెకండ్ లుక్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రతినాయకుడు బాబీడియోల్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ స్టూడియో గ్రీన్. బాబీడియోల్ పుట్టిన రోజును పురస్కరించుకుని పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఉధిరన్ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ ఫోటోలో బాబీడియోల్ ను చూస్తుంటే..గూస్ బంప్స్‌తో పాటు భయాన్ని కలిగిస్తుంది. ‘రూథ్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్గటబుల్‘ అంటూ క్యాప్షన్ జోడించారు. దీన్ని బట్టి చూస్తే.. మరింత క్రూరంగా ఆయన కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక కన్ను పూర్తిగా కనిపించకుండా.. మరో కంటితో చూస్తున్న బాబీ డియోల్‌ను అత్యంత కరుడుగట్టిన వ్యక్తిలా చూపించారు.

Bobbydiol is even more terrifying

బాబీడియోల్ ‘యానిమల్’‌కు ముందు.. ఆ సినిమా తర్వాత అన్నట్లు మారిపోయింది. ఆ సినిమాలో రణబీర్‌తో పోటీగా యాక్ట్ చేశారు. ఆయన స్క్రిన్ ప్రజెన్స్ చూసి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు ప్రేక్షకులు. ఇప్పుడు డిఫరెంట్ విలనీజానికి మారుపేరుగా మారిపోయాడు బాబీ. యానిమల్ తర్వాత ఆయనకు వరుసగా.. విలన్ రోల్స్ క్యూ కడుతున్నాయి. తెలుగులో హరిహర వీర మల్లుతో పాటు బాలకృష్ణ సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నాడని టాక్. ఇక కంగువ సినిమాను ప్రముఖ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌తో పాటు కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet