iDreamPost
android-app
ios-app

NBK 109లో యానిమల్ విలన్..?

  • Published Nov 24, 2023 | 6:12 PM Updated Updated Nov 28, 2023 | 1:23 PM

టాలీవుడ్‌లో ఈ ఏడాది రెండు హిట్లతో మంచి జోష్ మీదన్నారు బాలకృష్ణ. సంక్రాంతికి వీర సింహా రెడ్డి.. దసరా పండుగకు భగవంత్ కేసరి మూవీలతో బాక్సాఫీసును దడదడలాడించారు. ఇప్పుడు మరో మూవీని సిద్ధం చేశారు. ఈ చిత్ర షూటింగ్ లో బిజీ అయ్యారు బాలయ్య.. అయితే..

టాలీవుడ్‌లో ఈ ఏడాది రెండు హిట్లతో మంచి జోష్ మీదన్నారు బాలకృష్ణ. సంక్రాంతికి వీర సింహా రెడ్డి.. దసరా పండుగకు భగవంత్ కేసరి మూవీలతో బాక్సాఫీసును దడదడలాడించారు. ఇప్పుడు మరో మూవీని సిద్ధం చేశారు. ఈ చిత్ర షూటింగ్ లో బిజీ అయ్యారు బాలయ్య.. అయితే..

  • Published Nov 24, 2023 | 6:12 PMUpdated Nov 28, 2023 | 1:23 PM
NBK 109లో యానిమల్ విలన్..?

భగవంత్ కేసరి హిట్స్‌తో నందమూరి నట సింహం బాలకృష్ణ మంచి జోష్‌లో ఉన్నారు. హిట్ మూవీస్ డైరెక్టర్‌గా ముద్ర పడ్డ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా విడుదలై.. భారీ హిట్ అందుకుంది. మాస్, క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడిగా కనిపించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. వందవ చిత్రం పూర్తి చేయడం చేసిన నాటి నుండి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నారు బాలయ్య. ఇప్పుడు మరో చిత్రాన్ని షురూ చేశారు.

ఈ ఏడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి మూవీలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ నందమూరి నాయకుడు.. ఇప్పుడు తన 109 మూవీ షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. బాబీ దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి బాలయ్య లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందట. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు దర్శకుడు బాబీ. ఇప్పుడు ఈ సినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. గత చిత్రం భగవంత్ కేసరిలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించగా.. ఎన్బీకే 109లో కూడా బాలయ్యను ఢీకొట్టే నటుడు బీటౌన్ నుండే రాబోతున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు.. బాబీ డియోల్ ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. అలాగే ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసు దేవ మీనన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాబీ డియోల్.. యానిమల్ మూవీలో ప్రతినాయకుడు పాత్రలో కనిపించిన సంగతి విదితమే. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ విడుదలై.. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ఈ మూవీ విలనే.. త్వరలో టాలీవుడ్‌లో నేరుగా మరో మూవీ చేయనున్నాడని టాక్. అయితే బాబీ డియోల్ వీరమల్లు మూవీతో తెలుగు తెరంగేట్రం చేస్తున్నాడు.  అయితే పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ ఉంది.  ఇక బాలయ్య 109లో ఆయన ఎంట్రీపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet