iDreamPost
android-app
ios-app

యానిమల్ సునామీ.. వారం రోజుల్లో రూ. 500 కోట్లను దాటేసింది

  • Published Dec 08, 2023 | 2:09 PM Updated Updated Dec 08, 2023 | 2:09 PM

సందీప్ రెడ్డి వంగా మొన్నటి వరకు టాలీవుడ్ డైరెక్టర్. కానీ దేశమే కాదూ ప్రపంచం కూడా గుర్తుపెట్టుకునే దర్శకుడిగా అవతరించాడు. యానిమల్ మూవీతో ఆయన చేసిన మేనియా అంత ఇంత కాదూ. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు.. రికార్డులు బద్దలు కొడుతోంది.

సందీప్ రెడ్డి వంగా మొన్నటి వరకు టాలీవుడ్ డైరెక్టర్. కానీ దేశమే కాదూ ప్రపంచం కూడా గుర్తుపెట్టుకునే దర్శకుడిగా అవతరించాడు. యానిమల్ మూవీతో ఆయన చేసిన మేనియా అంత ఇంత కాదూ. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు.. రికార్డులు బద్దలు కొడుతోంది.

  • Published Dec 08, 2023 | 2:09 PMUpdated Dec 08, 2023 | 2:09 PM
యానిమల్ సునామీ.. వారం రోజుల్లో రూ. 500 కోట్లను దాటేసింది

సినిమా పట్ల విమర్శలు వచ్చినా.. తట్టుకుని కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది యానిమల్. సందీప్ రెడ్డి వంగా ఈసారి కూడా తనదైన మార్క్ డైరక్షన్‌నూ ఈ మూవీలో కూడా చూపించారు. సినిమా పట్ల ఎంత ఫ్యాషన్‌తో ఉన్నాడో తన పిక్చర్స్ చెబుతున్నాయి. ఇక రణబీర్ కపూర్ నటన గురించి చెబితే.. నెవ్వర్ బీఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది. సాధారణంటా ఇటీవల ఏ మూవీ అయినా వీకెండ్‌లో విడుదలై.. సోమవారానికి కలెక్షన్లు తగ్గిపోతుంటాయి. కానీ యానిమల్ విషయంలో అలా జరగలేదు. తన వేటను కొనసాగించింది. భారీ వసూళ్లను రాబట్టుకుంది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా బాక్సాఫీసు కలెక్షన్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ వారం గడిచిన తర్వాత కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.

డిసెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా విడుదలైంది యానిమల్. సినిమా విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్.. మూవీపై అంచనాలను పెంచేసిన సంగతి విదితమే. ‘వినిపిస్తోంది.. నాకేమీ చెవుడు లేదు’అన్న ఒక్క డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్లాయి. అనుకున్నట్లుగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశ పర్చలేదు. ఫ్యామిలీ అండ్ న్యూడిటీ, వయెలెన్స్ ఉన్నప్పటికీ.. మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు. తొలి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్, రివ్యూస్ రావడంతో ఈ పిక్చర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఏం తీశార్రా మూవీని బాబు అనేలా చేశాడు సందీప్. కేవలం ఇండియాలోనే కాదూ యుఎస్‌లో కూడా గల్లా పెట్టి నిండిపోయింది. బొమ్మ పడిన తొలి రోజే.. వరల్డ్ వైడ్‌గా 116 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది.

ఈ సినిమా విడుదలై వారం రోజులు గడిపోయింది. అయినా కూడా మూవీ బాక్సాఫీసు వద్ద గట్టిగానే రూపాయి వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 560 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది యానిమల్ చిత్రం. ఇప్పటి వరకు రూ. 563 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యింది. ఇది రణబీర్ కపూర్ చిత్రాల్లో హయ్యెస్ట్ అండ్ రికార్డు కలెక్షన్లనీ చెప్పొచ్చు. బహుశా సినిమాకు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ కానీ, కాసుల వర్షం కురుస్తుందని కానీ ఈ బీటౌన్ హీరో ఊహించి ఉండడు. ఇప్పటికే మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఈ వారాంతం కూడా మరిన్ని కలెక్షన్లు గుంజుకునే అవకాశం లేకపోలేదు. మరీ ఈ మూవీకి పోటీ లేకపోతే.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురవడం ఖాయం. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని మీరనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom