Animal: అఫీషియల్‌: OTTలోకి రణ్​బీర్ ‘యానిమల్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్​బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత పెద్ద హిట్​గా నిలిచిందో తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తడాఖా చూపించేందుకు రెడీ అయింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్​బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత పెద్ద హిట్​గా నిలిచిందో తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తడాఖా చూపించేందుకు రెడీ అయింది.

ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు రెస్పాన్స్, రియాక్షన్ మామూలుగా ఉండదు. సినిమా చూసే ఆడియెన్స్​తో పాటు క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా షాకవుతారు. కలెక్షన్లతో పాటు ప్రశంసలు కూడా అందుకోవడం, సినిమాను చూసే విధానాన్ని, తీసే విధానాన్ని ఇవి మార్చేస్తుంటాయి. ఈ కోవలోకే వస్తుంది ‘యానిమల్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ ఫిల్మ్ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. మూవీ గోయర్స్​తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ‘యానిమల్​’ను నెత్తిన పెట్టుకున్నారు. రూ.900 కోట్లకు పైగా వచ్చిన కలెక్షన్సే దీనికి ప్రూఫ్​. సినిమాను ఇలా కూడా తీయొచ్చా? హీరో క్యారెక్టర్​ను ఇంత డెడ్లీగా చూపించొచ్చా? అని ఈ చిత్రంతో అందర్నీ షాక్​కు గురిచేశారు సందీప్ రెడ్డి. అలాంటి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

బాలీవుడ్ సూపర్​స్టార్ రణ్​బీర్ కపూర్ యాక్ట్ చేసిన ‘యానిమల్’ జనవరి 26 నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది. రిపబ్లిక్ డే కానుకగా ఈ బ్లాక్​బస్టర్​ మూవీని తమ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమ్ చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి నెట్​ఫ్లిక్స్ సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్ట్ పెట్టింది. దీంతో ‘యానిమల్​’ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న ఓటీటీ ఆడియెన్స్​ సంతోషంలో మునిగిపోయారు. మరో పది రోజులు ఆగితే చాలని అనుకుంటున్నారు. అయితే డిజిటల్ వెర్షన్ కోసం ప్రేక్షకులు అంతగా వెయిట్ చేయడానికి మరో కారణం ఉంది. ఓటీటీలో రిలీజ్ చేసే వెర్షన్​లో కట్ చేయని ప్రింట్ ఇస్తానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా చెప్పారు. దీంతో 10 నిమిషాలకు పైగా ఎక్స్​ట్రా ఫుటేజ్ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సీజన్​లో ఎక్కువ మంది ఆడియెన్స్ ఎదురు చూస్తున్న ఓటీటీ రిలీజ్​గా ‘యానిమల్’కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వొచ్చు. డిసెంబర్​ 1వ తేదీన రిలీజైన ఈ సినిమా కంటెంట్ మీద ఎన్నో డిస్కషన్స్ నడిచాయి. పలు వైపుల నుంచి విమర్శలు కూడా భారీగానే వచ్చాయి. అయినా కలెక్షన్స్​లో దుమ్మురేపిన రణ్​బీర్ ఫిల్మ్ బాలీవుడ్ ఆల్​టైమ్ బ్లాక్​బస్టర్స్​లో చోటు దక్కించుకోవడాన్ని ప్రశంసించకుండా ఉండలేం. వసూళ్ల సంగతిని పక్కనపెడితే బిగ్​స్క్రీన్స్​లో ‘యానిమల్​’ను చూడనివారు ఓటీటీలో చూశాక ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఎక్స్​ట్రా ఫుటేజ్ కూడా యాడ్ చేస్తుండటంతో ఓటీటీలోకి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. మరి.. ఓటీటీలో స్ట్రీమింగ్​కు వచ్చేస్తున్న ‘యానిమల్​’ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Naa Saami Ranga Review in Telugu: నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ

Show comments