iDreamPost
android-app
ios-app

అనిమల్‌ ట్రైలర్‌ రివ్యూ… అంచనాలకు ఏ మాత్రం తగ్గదు!

అనిమల్‌ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ప్రతీ అప్‌డేట్‌ సినిమాపై అంచనాలను పెంచుతూ పోయింది. ఈ రోజు విడుదలైన ట్రైలర్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకుపోయింది.

అనిమల్‌ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ప్రతీ అప్‌డేట్‌ సినిమాపై అంచనాలను పెంచుతూ పోయింది. ఈ రోజు విడుదలైన ట్రైలర్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకుపోయింది.

అనిమల్‌ ట్రైలర్‌ రివ్యూ… అంచనాలకు ఏ మాత్రం తగ్గదు!

ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌- అర్జున్‌ రెడ్డి సినిమా ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో ‘అనిమల్‌’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌తో అనిమల్‌ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన నాటినుంచే మూవీపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ దగ్గరనుంచి టీజర్‌ ట్రైలర్‌ వరకు సినిమాపై అంచనాలు పెంచుతూ పోయాయి. ఇక, పాటల విషయం చెప్పనక్కర్లేదు.

విడుదలైన ప్రతీ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ సరసన నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించారు. అనిల్‌ కపూర్‌ రణ్‌బీర్‌ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. పవర్‌ ఫుల్‌ రౌడీ పాత్రలో బాబీ డియోల్‌ నటించారు. గురువారం మధ్యాహ్నం ‘అనిమల్‌’ ట్రైలర్‌ రిలీజైంది. ట్రైలర్‌ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలైంది. అన్నీ భాషల్లోనూ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొన్ని నిమిషాల్లో లక్షల వ్యూస్‌తో సాధించింది.

ట్రైలర్‌ ఎలా ఉందంటే..   

డోంట్‌ జడ్జ్ ఏ బుక్‌.. బై ఇట్స్‌ కవర్‌ అని ఇంగ్లీష్‌లో ఓ ఇడియమ్‌ ఉంది. అనిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ లుక్‌కు అతడి క్యారెక్టర్‌కు ఈ ఇడియమ్‌ సరిగ్గా సరిపోతుంది. అనిమల్‌ సినిమా పేరుకు తగ్గట్టుగానే రణ్‌బీర్‌ కపూర్‌ లుక్‌ ఊర మాస్‌గా ఉంది. శత్రువులను వేటాడే ఓ మృగంలానే రణ్‌బీర్‌ కపూర్‌ కనిపిస్తున్నారు. అయితే, అతడలా మారణానికి తండ్రిపై ఉన్న పిచ్చి ప్రేమేనని ట్రైలర్‌ను బట్టి చూస్తే తెలుస్తుంది. తండ్రి కోసం ప్రాణాలు లెక్క చేయని ఓ కొడుకు కదే అనిమల్‌.

ఇప్పుడున్న అంచనాలను మరీ పెంచకుండా.. ఎంతో సింపుల్‌గా తను చెప్పాల్సిన పాయింట్‌ను చెప్పారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ఓ వైపు తండ్రి ప్రేమ.. మరో వైపు భార్య ప్రేమ రెండింటి మధ్యా నలిగే పాత్రలో రణ్‌బీర్‌ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్‌ రెండు పాత్రలకు ఎలా న్యాయం చేశాడు అన్నదే మిగిలిన కథ. మరి, అనిమల్‌ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş