iDreamPost
android-app
ios-app

Animal: బంపర్‌ ఆఫర్‌.. రూ. 100కే యానిమల్‌ మూవీ టికెట్‌!

  • Published Jan 09, 2024 | 12:15 PM Updated Updated Jan 09, 2024 | 12:15 PM

యానిమల్‌ సినిమా విడుదలై నెల దాటినా.. థియేటర్లలో మాత్రం బాగా ఆడుతోంది. కలెక్షన్ల విషయంలో పర్వాలేదు అనిపిస్తోంది. తాజాగా, మూవీ విషయంలో బంపర్‌ ఆఫర్‌ వచ్చింది.

యానిమల్‌ సినిమా విడుదలై నెల దాటినా.. థియేటర్లలో మాత్రం బాగా ఆడుతోంది. కలెక్షన్ల విషయంలో పర్వాలేదు అనిపిస్తోంది. తాజాగా, మూవీ విషయంలో బంపర్‌ ఆఫర్‌ వచ్చింది.

  • Published Jan 09, 2024 | 12:15 PMUpdated Jan 09, 2024 | 12:15 PM
Animal: బంపర్‌ ఆఫర్‌.. రూ. 100కే యానిమల్‌ మూవీ టికెట్‌!

సందీప్‌ రెడ్డి వంగా.. రణబీర్‌ కపూర్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన యానిమల్‌ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా మొదటి నుంచి కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఏకంగా 60 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. ఇప్పటి వరకు ఏకంగా 887 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు 40 రోజులు అవుతోంది.

40 రోజులు అయినా.. కలెక్షన్ల విషయంలో మూవీ పర్వాలేదు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్లకు సంబంధించి యానిమల్‌ చిత్ర బృందం ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం 100 రూపాయలకే మూవీ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. బుక్‌ మై షో లేదా పేటీఎంలలో 100 రూపాయలకే టికెట్‌ ను బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. 100 రూపాయలకే టికెట్‌ వస్తుండటంతో.. ఫ్యాన్స్‌ మరోసారి సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు.

animal movie ticket only 100rs

కాగా, యానిమల్‌ మూవీలో రణబీర్‌ కపూర్‌ కు జంటగా.. రష్మిక మందన్నా నటించగా.. బాబీడియోల్‌, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో కనిపించారు. యానిమల్ సంక్రాంతి సందర్భంగా ఓటీటీలోకి రానుందని సమాచారం. జనవరి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుందని సమాచారం. థియేటర్లలో యానిమల్‌ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితో ‍విడుదలయ్యింది. ఓటీటీలో మాత్రం ఓ అరగంట ఎక్కువగా ఉండనుంది. దాదాపు 4 గంటలు స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు యానిమల్‌ ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇక, ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేయనుందో వేచి చూడాలి​. యానిమల్‌ కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్‌ సీస్‌ లోనూ సత్తా చాటింది. మిలియన్ల కొద్దీ డాలర్ల వసూళ్లను సాధించింది. పాత రికార్డులను సైతం తుడిచి పెట్టేసింది. కొన్ని చోట్ల బాహుబలి రికార్డులను సైతం యానిమల్‌ బ్రేక్‌ చేసింది. మరి, యానిమల్‌ సినిమా టికెట్లు కేవలం 100 రూపాయలకే అందుబాటులోకి తీసుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss