iDreamPost
android-app
ios-app

Animal: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనుకున్న దానికంటే ముందే యానిమల్ పార్క్!

  • Published Jan 24, 2024 | 5:24 PM Updated Updated Jan 24, 2024 | 5:24 PM

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో డిసెంబర్1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన యానిమల్ సినిమాకు.. అతి త్వరలోనే "యానిమల్ పార్క్" పేరుతో సిక్వెల్ ప్రారంభం కానుందనే వార్తలు.. సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో డిసెంబర్1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన యానిమల్ సినిమాకు.. అతి త్వరలోనే "యానిమల్ పార్క్" పేరుతో సిక్వెల్ ప్రారంభం కానుందనే వార్తలు.. సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

  • Published Jan 24, 2024 | 5:24 PMUpdated Jan 24, 2024 | 5:24 PM
Animal: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనుకున్న దానికంటే ముందే యానిమల్ పార్క్!

ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుందని చెప్పి తీరాల్సిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సిక్వెల్ అంటే ముందుగా గుర్తొచ్చేది బాహుబలి 1,2 చిత్రాలే. ఆ తర్వాత కెజిఫ్ చాప్టర్ 1,2. ఇప్పటికే ఇలా ఎన్నో హిట్ చిత్రాల సిక్వెల్స్ థియేటర్ లలో సందడి చేశాయి. ప్రేక్షకుల నుంచి కూడా సిక్వెల్స్ కు ఎనలేని ఆదరణ లభించడంతో.. ఇంకా ఇది ట్రెండ్ గా మారిపోయింది. గత ఏడాది చివరిలో ఇండస్ట్రీకి భారీ హిట్ ను సాధించిపెట్టి.. బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన చిత్రాలు.. అప్పుడే సిక్వెల్స్ కు రెడీ అయిపోయాయి. మేకర్స్ కూడా ఈ సిక్వెల్స్ ను అనౌన్స్ చేయడంతో.. అభిమానులు వేయికళ్లతో వాటికోసం ఎదురుచూస్తున్నారు. 2025లో చూసినట్లయితే ఎక్కువగా విడుదల అయ్యే సినిమాల ఈ లిస్ట్ లో సిక్వెల్స్ ఏ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 1న సందీప్ రెడ్డి వంగ దర్శత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ చిత్రం.. ప్రేక్షకులలో ఏ రకంగా ఆకట్టుకుందో అందరికి తెలుసు. అయితే, ఇప్పుడు యానిమల్ చిత్రానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

యానిమల్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ .. యానిమల్ సిక్వెల్ “ది యానిమల్ పార్క్” అని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన , బాబీ డియోల్ ప్రధాన పాత్రలుగా నటించిన “యానిమల్”.. కొద్దీ వారల పాటు థియేటర్ లను ఖాళీ లేకుండా చేసింది. ఈ చిత్రం విడుదలైన సమయంలో ఎక్కడ చూసిన అంతా.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గురించే చర్చలు జరిగాయి. అంత ఇంపాక్ట్ ను అందరిలో క్రియేట్ చేశాడు సందీప్. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏకంగా రూ.900 కోట్లు కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది యానిమల్. అభిమానుల నుంచి ఇంతటి ఆదరణ లభించిన తర్వాత.. సందీప్ ఈ చిత్రానికి యానిమల్ పార్క్ పేరిట సిక్వెల్ ను అనౌన్స్ చేశాడు. దీనితో అభిమానులకు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దీని గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వింటూనే ఉన్నాము . కానీ, ఇప్పుడు తాజాగా యానిమల్ పార్క్ గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది. యానిమల్ సిక్వెల్ గురించైతే సందీప్ అనౌన్స్ చేసాడు కానీ.. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ సిక్వెల్ రావడానికి కాస్త టైమ్ పడుతుందని అందరు అనుకున్నారు. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. యానిమల్ పార్క్ అనుకున్నదానికంటే ముందుగానే వచ్చేలా ఉంది.

అయితే, యానిమల్ తర్వాత .. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో మరో మూవీకి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించాడు. ఇక అటు రణ్ బీర్ కూడా బ్రహ్మాస్త్ర 2 చేద్దాం అనుకునే ప్లాన్ లో ఉన్నాడు. దీనితో వీరిద్దరూ ఫ్రీ అయిన తర్వాత యానిమల్ 2 సెట్స్ పైకి తీసుకువెళ్దాం అనుకున్నాడు సందీప్. కానీ, అయాన్ ముఖర్జీ ఇప్పుడు వార్ 2 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. కాబట్టి బ్రహ్మస్త్ర 2కి సమయం పడుతుంది. అటు ప్రభాస్ విషయానికొస్తే కల్కి, రాజాసాబ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ రెండు కంప్లీట్ అయిన తర్వాత సలార్ 2 స్టార్ట్ చేసే ప్లాన్ ఉన్నాడు డార్లింగ్. కాబట్టి స్పిరిట్ మూవీ ఆలస్యం అవ్వడం తప్పదు. దీనితో ప్రభాస్ ఫ్రీ అవ్వడానికి కూడా చాలా సమయమే పట్టేలా ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో యానిమల్ పార్క్ మూవీని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. ప్రస్తుతం యానిమల్ పార్క్ కు స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం. అంతా బాగానే ఉంటే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇప్పుడు యానిమల్ పార్క్ ఎటువంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş