iDreamPost
android-app
ios-app

Animal: రణ్ బీర్ ఎంట్రీ స్టెప్స్ కంపోజ్ చేసిన తెలుగు కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?

  • Author Soma Sekhar Updated - 04:11 PM, Wed - 6 December 23

యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్ ఎంట్రీ సీన్ కు స్టెప్పులు నేర్పించింది తెలుగు కొరియోగ్రాఫర్ అని మీకు తెలుసా? మరి డ్యాన్స్ మాస్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం

యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్ ఎంట్రీ సీన్ కు స్టెప్పులు నేర్పించింది తెలుగు కొరియోగ్రాఫర్ అని మీకు తెలుసా? మరి డ్యాన్స్ మాస్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం

  • Author Soma Sekhar Updated - 04:11 PM, Wed - 6 December 23
Animal: రణ్ బీర్ ఎంట్రీ స్టెప్స్ కంపోజ్ చేసిన తెలుగు కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?

యానిమల్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం సినీ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఆ రొమాన్స్ ఏంటి?.. ఆ వైలెన్స్ ఏంటి? అంటూ ప్రేక్షకులు షాక్ కు గురవుతున్నారు. ఇక ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఓ క్లిప్ వైరల్ గా మారింది. అదేంటంటే? రణ్ బీర్ ఎంట్రీ స్టెప్స్. ఒక పక్క రష్మికకు నిశ్చితార్థం జరుగుతుంటే రణ్ బీర్ వైలెంట్ ఎంట్రీ అదిరిపోతుంది. ఈ ఎంట్రీలో మైఖేల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టాడు రణ్ బీర్. ఇక ఈ స్టెప్పులు నేర్పించింది తెలుగు కొరియోగ్రాఫరే అని మీలో ఎంతమందికి తెలుసు?

మూవీల్లో హీరోల ఇంట్రడక్షన్ ను డైరెక్టర్లు సపరేట్ గా ప్లాన్ చేస్తుంటారు. ఒక్కో దర్శకుడికి హీరోలను పరిచయం చేయడంలో ఒక్కో వే ఉంటుంది. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న ఇంట్రడక్షన్ ఏదైనా ఉందంటే? అది యానిమల్ రణ్ బీర్ కపూర్ ఇంట్రడక్షన్ సీనే. ఈ మూవీలో ఒకపక్క రష్మికకు ఎంగేజ్ మెంట్ జరుగుతుంటే.. ఇంకోపక్క రణ్ బీర్ కపూర్ మైఖేల్ జాక్సన్ స్టెప్పులతో వైలెంట్ గా ఎంట్రీ ఇస్తాడు. ఇది సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అయితే ఈ పర్టిక్యూలర్ సీన్ కు, రణ్ బీర్ వేసిన స్టెప్పులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ స్టెప్పులను రణ్ బీర్ కు నేర్పించింది మన తెలుగు కొరియోగ్రాఫరే అని మీకు తెలుసా.

ఈ డ్యాన్స్ మూమెంట్స్ ను నేర్పించింది టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్. ఈ విషయాన్ని స్వయంగా సందీపే తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఈ చిన్న బిట్ ను నా చేత కంపోజ్ చేపించినందుకు సందీప్ రెడ్డి వంగాకు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు ఆట సందీప్. ఆట డ్యాన్స్ షో ద్వారా సందీప్ ఫేమస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఆట సందీప్ గా మారి.. టాలీవుడ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఇక ఇటీవలే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాడు సందీప్.

కాగా.. సందీప్ లాంటి అండర్ రేటెడ్ కొరియోగ్రాఫర్ ని గుర్తించి అవకాశం ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అతడికి ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు. మరి ఈ స్టెప్పులతోనైనా అతడికి గుర్తింపుతో పాటుగా అవకాశాలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే మూవీ టైటిల్ కార్డ్స్ లో క్రెడిట్స్ లో పేరు లేకపోవడాన్ని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రణ్ బీర్ వేసిన స్టెప్పులు మాత్రం అదుర్స్ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. మరి యానిమల్ లాంటి బిగ్ మూవీకి ఆట సందీప్ స్టెప్పులు కొరియోగ్రఫీ చేయం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetticket girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş