iDreamPost
android-app
ios-app

‘యానిమల్’ నిర్మాత ఇంట తీవ్ర విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి

  • Published Jul 19, 2024 | 4:04 PM Updated Updated Jul 19, 2024 | 4:04 PM

Animal Movie Producer: ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. స్టార్ నటీనటులు, దర్ధక నిర్మాతలు వారి కుటుంబ సభ్యులు వరుసగా కన్నుమూయడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంటుంది. బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

Animal Movie Producer: ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. స్టార్ నటీనటులు, దర్ధక నిర్మాతలు వారి కుటుంబ సభ్యులు వరుసగా కన్నుమూయడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంటుంది. బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

  • Published Jul 19, 2024 | 4:04 PMUpdated Jul 19, 2024 | 4:04 PM
‘యానిమల్’ నిర్మాత ఇంట తీవ్ర విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి

ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చోటు చేసుకుంటున్నాయి. సినీ దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. హాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా వివిధ పరిశ్రమల్లో సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.ఈ ఏడాది గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానిక్ నటుడు ఇయాన్ గెల్డర్, మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కనకలత, దర్శకుడు, హరి కుమార్ ఇలా పలువురు నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూశారు. తాజాగా బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సెన్సెషన్ హిట్ అయ్యింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన కృష్ణన్ కుమార్ గారాల పట్టి తిషా కుమార్(21) కన్నుమూసింది. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న తిషా కుమార్ జర్మనీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సీరీస్ ధృవీకరించారు. ఈ సందర్భంగా తీషా మరణం కృష్ణన్ కుమార్ కుటుంబానికి తీరని లోటు..T-సిరీస్ ప్రతినిధి వారి బాధను వ్యక్తం చేశారు.

బాలీవుడ్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థ టీ-సీరీస్. దీన్ని భూషన్ కుమార్ చూసుకుంటున్నారు.. ఆయనకు చిన్నాన్న కృష్ణన్ కుమార్. ప్రస్తుతం టీ-సీరీస్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. 1995 లో ‘బేవఫా సనమ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాణ రంగం వైపు వచ్చారు. ఈ క్రమంలోనే గత ఏడాది సూపర్ హిట్ అయిన ‘యానిమల్’ కి నిర్మాతగా వ్యవహరించారు. ఆయన ముద్దుల కూతురు తిషా చిన్న వయసులోనే కన్నుమూయడం తీవ్ర విచారకరం. తిషా మరణ వార్త తెలిసిన ఇండస్ట్రీలో ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss