iDreamPost
android-app
ios-app

Animal Movie: యానిమల్ లో షారుఖ్ ఖాన్ నటించి ఉంటే?

  • Published Mar 27, 2024 | 8:59 AM Updated Updated Mar 27, 2024 | 9:00 AM

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం.ఆల్ఫా మేల్‌ యాటిట్యూడ్ తో ఉండే హీరో క్యారెక్టర్ తో తెరకెక్కిన ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం.ఆల్ఫా మేల్‌ యాటిట్యూడ్ తో ఉండే హీరో క్యారెక్టర్ తో తెరకెక్కిన ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి.

  • Published Mar 27, 2024 | 8:59 AMUpdated Mar 27, 2024 | 9:00 AM
Animal Movie: యానిమల్ లో షారుఖ్ ఖాన్ నటించి ఉంటే?

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్‌లలో ఒకటిగా మాత్రమే కాకుండా, ఇటీవలి కాలంలో ఎక్కువ కాలం చర్చల్లో ఉన్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఆల్ఫా మేల్‌ యాటిట్యూడ్ తో ఉండే హీరో క్యారెక్టర్ తో తెరకెక్కిన ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. హీరోగా రణబీర్ కపూర్ పాత్రను ఉండాల్సిన దానికంటే ఎక్కువగా హింసాత్మకంగా చూపించారని ఒక వర్గం ప్రేక్షకులు, విమర్శకులు భావించారు. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా రణబీర్ వల్ల కాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వల్ల మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ స్థానంలో షారుఖ్ ఖాన్‌ నటించి ఉంటే ఎలా ఉంటుందో అనే ఒక ఆలోచన ఒక కొత్త చర్చకి దారి తీసింది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ అంటే రోమాన్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణిస్తారు. కానీ, కొందరు ఫ్యాన్స్ అసాధ్యమైన ఈ పనిని నిజం చేయడానికి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని వాడారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రణబీర్ బదులు షారుఖ్ ఖాన్ ను పెట్టి సినిమాలోని సీన్స్ ను AI ద్వారా రిక్రియేట్ చేశారు. ఇక వెంటనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంటెన్స్ లుక్ లో షారుఖ్ అదిరిపోయారని, యానిమల్ సినిమాలో నిజంగా ఆయన నటించి ఉంటే బాగుండేదని కొందరు అన్నారు. అయితే మరి కొంతమందికి మాత్రం ఈ ఐడియా నచ్చలేదు. హీరోయిన్ పాత్రను అనవసరంగా హింసించే పాత్రలో షారుఖ్ ను తాము అస్సలు చూడలేమని ఒక వర్గం ప్రేక్షకులు అన్నారు.

Animal

యానిమల్ సినిమా విషయానికొస్తే, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 1, 2023న థియేటర్లలో విడుదల అయింది. ఇందులో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయి ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş