iDreamPost
android-app
ios-app

Animal Movie: యానిమల్ బ్యూటీ ఎమోషనల్ వీడియో.. తెలుగు ఫ్యాన్స్ గురించి చెప్తూ..!

  • Published Dec 10, 2023 | 10:41 AM Updated Updated Dec 10, 2023 | 10:41 AM

యానిమల్ సినిమాకి ఇండియన్ ఫ్యాన్స్ నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఇదే జోరు కొనసాగితే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

యానిమల్ సినిమాకి ఇండియన్ ఫ్యాన్స్ నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఇదే జోరు కొనసాగితే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

  • Published Dec 10, 2023 | 10:41 AMUpdated Dec 10, 2023 | 10:41 AM
Animal Movie: యానిమల్ బ్యూటీ ఎమోషనల్ వీడియో.. తెలుగు ఫ్యాన్స్ గురించి చెప్తూ..!

యానిమల్ మూవీ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంకొందరైతే అక్కసుతో అది అసలు మూవీనే కాదు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్ సక్సెస్ ని బాలీవుడ్ లో చాలామంది ఓర్వలేకపోతున్నారు. పని గట్టుకుని తక్కువ రేటింగ్స్ ఇచ్చినా కూడా ప్రేక్షకుల నుంచి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రెండో శుక్రవారం కూడా బాలీవుడ్ లో రూ.21.56 కోట్ల నెట్ కలెక్షన్స్ తో అందరికీ షాకిస్తోంది. ఈ మూవీ టీమ్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అబ్రార్ మూడో భార్యగా చేసిన నటి అయితే ఎమోషనల్ మెసేజ్ కూడా షేర్ చేసుకుంది.

కొందరికి కొన్ని కొన్ని సినిమాలు కెరీర్ లో బ్రేక్ ఇస్తాయి. ఈ యానిమల్ సినిమా అలా చాలా మందికి బ్రేక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో నటీమణులకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే జోయా పాత్ర చేసిన తృప్తీ ధిమ్రీని తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆమె తర్వాత బాబీ డియోల్ చేసిన అబ్రార్ పాత్రకు మూడో భార్యగా నటించిన మాన్సీ తక్షక్ కి కూడా అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఆమె అసలు ఈ తరహా రెస్పాన్స్ ని ఊహించి కూడా ఉండదు. లీడ్ రోల్ కు దక్కిన స్థాయిలో ఆదరణ ఇప్పుడు ఈమెకు లభిస్తోంది. అందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ మాన్సీ తక్షక్ ఎమోషనల్ అయ్యింది.

మాన్సీ తక్షక్ తన ఫీలింగ్స్ ని అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. ఆమెకు గతంలో ఇన్ స్టాగ్రామ్ లో 8 వేల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్లు. ఆ సంఖ్య ఆమె వీడియో చేసే సమయానికి 82 వేలకు చేరింది. అయితే ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 1.43 లక్షలు దాటిపోయింది. వారిలో ముఖ్యంగా తెలుగు వాల్లే ఉండటంపై మాన్సీ ఆనందం వ్యక్తం చేస్తోంది. అందుకే తెలుగు వారికోసం స్పెషల్ మెసేజ్ కూడా చెప్పింది. “మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ తెలుగులో మాట్లాడింది. ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే తనను మన్నించాలంటూ కోరుకుంది. ఈమె గతంలో పఠాన్ సినిమాలో చేసినా కూడా ఇంత గుర్తింపు లభించలేదు. కానీ, యనిమల్ సినిమాతో.. చేసింది సపోర్టింగ్ రోల్ అయినా కూడా ఒక హీరోయిన్ కి దక్కిన అభిమానం ఈమెకు దక్కుతోంది. అందుకే మాన్సీ తక్షక్ అంత ఎమోషనల్ అయ్యింది.

అలాగే సినిమాపై వస్తున్న నెగిటివిటీకి సంబంధించి కూడా మరో సందర్భంలో మాన్సీ స్పందించింది. ముఖ్యంగా పెళ్లి సీన్ గురించి మాట్లాడింది. “అందరూ ఆ సీన్ చూసి తప్పుబడుతున్నారు. నిజానికి అది ఎంతో మంచి పెళ్లి వేడుక. ఎంతో ఆనందంగా జరగాల్సిన వేడుక అది. కానీ, అనుకోని సమయంలో వినకూడని విషయం వినడం వల్ల అబ్రార్ అలా రియాక్ట్ అవుతాడు. అయితే అది బాబీ డియోల్ సార్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు వాడుకున్న సీన్. నిజానికి అలా జరగాలి అని ఎవరూ కోరుకోరు. ఇలాంటి ఘనటలు ఎక్కడా జరగకూడదు కూడా. అది కేవలం సినిమాలో పాత్ర కోసం చేసిన సన్నివేశం మాత్రమే” అంటూ మాన్సీ సమాధానం చెప్పింది. మరి.. తెలుగు ప్రేక్షకులకు మాన్సీ తక్షక్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss