Nidhan
సినిమా లిరిక్స్‌కు అర్థాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సొంత భాషా మూవీస్ అయితే ఈజీగా అర్థమైపోతాయి. కానీ పరభాషా చిత్రాల్లోని పాటలు భాష తెలిసినా ఓ పట్టాన అర్థం కావు. ‘యానమిల్’ మూవీలోని ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అలాంటి ఈ పాట మీనింగ్ ఇప్పుడు తెలుసుకుందాం..
సినిమా లిరిక్స్‌కు అర్థాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సొంత భాషా మూవీస్ అయితే ఈజీగా అర్థమైపోతాయి. కానీ పరభాషా చిత్రాల్లోని పాటలు భాష తెలిసినా ఓ పట్టాన అర్థం కావు. ‘యానమిల్’ మూవీలోని ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అలాంటి ఈ పాట మీనింగ్ ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
సినిమాల్లో సక్సెస్ ఫార్ములా అనేది ఏదీ లేదు. ట్రెండ్‌ను బట్టి, ఆడియెన్స్ పల్స్‌ను బట్టి మూవీస్‌ను తీస్తూ పోవడమే. తమకు నచ్చిన కథ.. ప్రేక్షకులకూ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లాల్సిందే. అందుకే మూవీకి మొదటి వ్యూయర్ డైరెక్టర్ అని అంటుంటారు. స్టోరీ రాసేటప్పుడు, షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే ఫిల్మ్ ఎలా ఉంటుందో అతడి బుర్రలో ఇమిడిపోవాలి. అప్పుడే అనుకున్న కథను అనుకున్నంత బాగా తీయగలడని అంటుంటారు. అయితే చాలా మటుకు ఒకే ఫార్ములా స్టోరీస్‌తో సినిమాలు రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఏదైనా ఒక జోనర్ సక్సెస్ అయితే దాన్ని పట్టుకొని మిగతావారూ అలాంటి మూవీస్ తీస్తున్నారు. దీంతో మూస ధోరణిలోకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్లిపోతోందనే కామెంట్స్ వస్తున్నాయి.
మూసను పోగొడుతూ స్టోరీ రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్‌లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు వచ్చిన ‘శివ’ అలాంటిదే. రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ మూవీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసింది. ప్రతి పదేళ్లకోసారి అలాంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్స్ వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజైన ‘యానిమల్’ కూడా ఈ కోవలోకే వస్తుందని ప్రేక్షకులు సహా విమర్శకులు కూడా అంటున్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా రైటింగ్, డైరెక్షన్ స్టైల్‌కు, రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అక్కడ, ఇక్కడ అనే తేడాల్లేకుండా రిలీజైన ప్రతి చోటా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది ‘యానిమల్’. ఈ మూవీ ఇప్పటికే రూ.338 కోట్ల నెట్ వసూలు చేసి.. రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు దూసుకెళ్తోంది.
రొటీన్ మూవీస్‌కు భిన్నంగా ఉన్న ‘యానిమల్’ను ఆడియెన్స్ అక్కున చేర్చుకున్నారు. ఈ మూవీ స్పీడ్ చూస్తుంటే గ్రాస్ పరంగా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.1,000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీ సక్సెస్‌లో సందీప్ డైరెక్షన్, రణ్‌బీర్ యాక్టింగ్‌తో పాటు బీజీఎం, సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించాయి. ఈ ఫిల్మ్‌లో వన్ ఆఫ్ ది హైలైట్స్‌లో ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ ఒకటని చెప్పొచ్చు. అయితే హిందీ సినిమా అయినప్పటికీ హీరో ఫ్యామిలీది పంజాబీ నేపథ్యం కావడంతో కొన్ని పాటల్ని ఆ భాష నుంచే తీసుకున్నారు. దీంతో ఆ పాటల అర్థం ఏంటో ఎవరికీ తెలియడం లేదు. ‘యానిమల్’లోని ఇతర సాంగ్స్‌ను తెలుగు, తమిళంలోకి డబ్ చేసినప్పటికీ ‘అర్జన్ వేల్లీ’ని మాత్రం అలాగే ఉంచేశారు సందీప్ రెడ్డి వంగా. డబ్ చేస్తే మీనింగ్ మారిపోతుందని, దాని విలువ పోతుందని అలాగే ఉంచేశారట. ఈ నేపథ్యంలో ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
‘అర్జన్ వేల్లీ’ లిరిక్‌లోని వేల్లీ అంటే ధైర్యవంతుడని అర్థం. ‘హో కడే విచ్ దంగ్ ఖడ్కే.. ఓత్తే హోగయి లడాయీ భారీ’ అంటే బరిలోకి దిగాక అందులో భారీ గొడవ జరుగుతుంది. దీంతో లాఠీ ఛార్జ్ నడుస్తుందనేది మీనింగ్. ఆ తర్వాత ‘అర్జన్ వేల్లీని ఓ పేర్ జోడ్కే గందాసీ మారి’ అనే లైన్ వస్తుంది. దీనర్థం ధైర్యవంతుడైన అర్జున్ గొడవకు దిగాడని.. గందాసీ (గొడ్డలి లాంటి వెపన్) అనే ఆయుధాన్ని వాడాడని. అనంతరం వచ్చే లైన్స్‌లో ఎలాంటి వెపర్స్ను వినియోగిస్తాడో కూడా చెబుతారు. నెక్స్ట్ లైన్స్‌లో వాళ్లు ఫైట్ చేసిన విధానాన్ని వివరిస్తారు. ‘ఓ సానాన్ వంగున్ జట్ భిడ్దే.. సఖి సుఖ్ నా దిస్సే భగ్వానా’ అని ఉంటుంది. అంటే టీమ్ అంతా కలసి బుల్స్లా ఫైట్ చేస్తున్నారని.. దీని వల్ల దరిదాపుల్లో శాంతి అనేది లేకుండా పోయిందని అర్థం. ‘ఓ లీరో లీర్ హో జావోగీ.. కేందే బచ్నో ది ఫుల్కారీ’ అనేది తర్వాతి లైన్. అంటే ఆ యుద్ధం ఎంత దారుణంగా ఉందంటే.. అందరూ ముక్కలు ముక్కలైపోతున్నారు.
‘కుండియాన్ ద సింగ్ ఫస్ గయే.. ’ అంటే ఇద్దరు సింగ్స్ ఫైట్స్ చేసుకుంటున్నారు. రెండు ఎడ్లు ఫైట్ చేసినప్పుడు వాటి కొమ్ములు ఇరుక్కుపోయిన మాదిరిగా అలా కొట్లాడుతున్నారట. ‘ధర్తీ తే ఖూన్ దుల్లేయా వే.. జీవే టిడ్కే ఘడే ఛో పానీ’ అనేది తర్వాతి లైన్. ధర్తీ అంటూ భూమి. ఖూన్ అంటే రక్తం. ఘడే ఛో పానీ అంటే కుండ కింద ఉన్న రక్తం. నెత్తురుతో నిండిన కుండ కింద పడిపోయినప్పుడు రక్తం ఎలా నేల మీద పారుతుందో.. ఈ ఫైట్ తర్వాతా అంత బ్లడ్ వస్తుందని చెబుతున్నారు. ‘ఓ షేరా వంగు యార్ ఖడ్ గయే.. వేల్లి నాల్ సే జిన్నా దే యారీ’ అనేది నెక్స్ట్ వచ్చే లిరిక్. షేరా అంటే సింహాలు. వేల్లి నాల్ సే జిన్నా దే యారీ అంటే ధైర్యవంతులైన స్నేహితులనేది అర్థం. అర్జున్ తన ఫ్రెండ్స్ సింహాల్లా నిల్చున్నారు. ఆ తర్వాత అర్జున్ నరకడం, ప్రత్యర్థులను తుదముట్టించం గురించి వివరిస్తూ సాగుతుంది. మరి.. ‘యానిమల్’ సినిమాలో మీకే పాట నచ్చిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కేశవ బెయిల్ కోసం పుష్ప టీమ్ ప్రయత్నాలు.. నిజమెంత?