Venkateswarlu
యానిమల్ సినిమాతో త్రిప్తి దిమ్రికి మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో త్రిప్తి ట్రెండింగ్‌లో నిలిచింది. ఆమెకు వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక, ఈమెకు రవితేజ సినిమాలో...
యానిమల్ సినిమాతో త్రిప్తి దిమ్రికి మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో త్రిప్తి ట్రెండింగ్‌లో నిలిచింది. ఆమెకు వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక, ఈమెకు రవితేజ సినిమాలో...
Venkateswarlu
యానిమల్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 500 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారత్ కంటే ఎక్కువగా ఓవర్‌సీస్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. యానిమల్ పాత రికార్డులను తుడిచి పెట్టేస్తోంది. బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఈ చిత్రం రణబీర్ కపూర్ సినిమా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఇక, ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా యానిమల్‌లో సెకండ్ లీడ్ చేసిన త్రిప్తి దిమ్రి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. చేసింది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా.. త్రిప్తికి మంచి గుర్తింపు వచ్చింది. దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంత వరకు తీసిన సినిమాలతో రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు ఓ తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం.
మాస్ మహారాజా రవితేజ, హిట్టు సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సినిమా టీంనుంచి కానీ, దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి కానీ, కన్‌ఫర్‌మేషన్ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి యానిమల్ త్రిప్తి సినిమా కెరీర్‌ను మార్చేశాడని చెప్పుకోవాలి.
కాగా, యానిమల్ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో నడుస్తున్నారట. థియేటర్లలో ఇంకా యానిమల్ హవా నడుస్తోంది. వసూళ్లు 1000 కోట్ల మార్కును ఈజీగా తాకే అవకాశం ఉంది. ఇక, ఈ చిత్రం థియేటర్లలో 3:21 నిమిషాల నిడివితో విడుదల అయింది. కానీ, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో మాత్రం 4 గంటల నిడివితో స్ట్రీమింగ్ అవ్వనుంది. అంతేకాదు! అందరూ అనుకున్నట్లుగానే యానిమల్‌కు సీక్వెల్ కూడా ఉంది.
చిత్ర బృందం యానిమల్ ఎండింగ్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మొదటి భాగమే ఇంత రచ్చ చేస్తే.. రెండో భాగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండవ భాగంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మించి రెండవ భాగం ఉండనుందని ఆశిద్దాం. మరి, యానిమల్ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి..రవితేజ సినిమాలో అవకాశం దక్కించుకుందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.