iDreamPost
android-app
ios-app

Animal Movie: యానిమల్ విలన్ మూడో భార్య.. రియల్ లైఫ్ లో ఎలా ఉందంటే..?

  • Published Dec 05, 2023 | 5:34 PM Updated Updated Dec 05, 2023 | 5:34 PM

కొన్నిసార్లు సినిమాలో యాక్ట్ చేసిన లీడ్ క్యారెక్టర్ల కంటే కూడా సపోర్టింగ్ రోల్స్ చేసిన వారికే ఎక్కువ అటెన్షన్ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు యానిమల్ చిత్రంలోని అబ్రార్ మూడో భార్యకు లభించినట్లుగా..

కొన్నిసార్లు సినిమాలో యాక్ట్ చేసిన లీడ్ క్యారెక్టర్ల కంటే కూడా సపోర్టింగ్ రోల్స్ చేసిన వారికే ఎక్కువ అటెన్షన్ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు యానిమల్ చిత్రంలోని అబ్రార్ మూడో భార్యకు లభించినట్లుగా..

  • Published Dec 05, 2023 | 5:34 PMUpdated Dec 05, 2023 | 5:34 PM
Animal Movie: యానిమల్ విలన్ మూడో భార్య.. రియల్ లైఫ్ లో ఎలా ఉందంటే..?

యానిమల్ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. ఒక సినిమాని ఇలా కూడా తీస్తారా? అంటూ డైరెక్టర్లు సైతం తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా సందీప్ వంగా పేరు బాలీవుడ్ లో కూడా ఇప్పుడు రీసౌండింగ్ వస్తోంది. ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.425 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి మూవీ లవర్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. 3 గంటల 22 నిమిషాల సినిమా అని ఎవ్వరూ వెనుకాడటం లేదు. ఈ మూవీలో రష్మికా మందన్నా తర్వాత ఇంకా కొంతమంది నటీమణుల పేర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యాక కేవలం హీరోయిన్ కి మాత్రమే కాకుండా.. ఆ మూవీలో చేసిన ఫీమేల్ యాక్రెసెస్ కి కూడా నెట్టింట పాపులారిటీ వస్తుంది. ఒక్కోసారి హీరోయిన్ కి మించి కూడా రెస్పాన్స్ రావచ్చు. ఈ యానిమల్ చిత్రం కూడా అలాంటి కోవకే చెందుతుంది. యాక్టింగ్ పరంగా రష్మికా మందన్నాకు ఎంతో క్రేజ్ వచ్చింది. కానీ, జోయా క్యారెక్టర్- అబ్రార్ మూడో భార్యలకు మంచి అప్లాజ్ కూడా లభిస్తోంది. ఇప్పటికే జోయా పాత్ర చేసిన తృప్తి ధిమ్రీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. మీమర్స్ ఇప్పుడు విలన్ అబ్రార్ మూడో భార్యపై ఫోకస్ పెట్టారు. ఆమె గురించే వరుస మీమ్స్, సోషల్ మీడియా పోస్టులు రావడంతో.. ఒక్కసారిగా అందరి చూపు ఇప్పుడు మాన్సీ తక్షక్ మీదకు మళ్లింది.

నిజానికి రియల్ లైఫ్ లో మాన్సీ తక్షక్ ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె కేవలం ఏదైళ్ల క్రితమే యాక్టింగ్ మొదలు పెట్టింది. ఒక మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఇటీవల పఠాన్ సినిమాలో యాక్ట్ చేసిందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. పఠాన్ సినిమాలో చేసినా కూడా తెలుగు ప్రేక్షకుల దగ్గర మాత్రం అంత గుర్తింపు సంపాదించలేకపోయింది. కానీ, యానిమల్ సినిమాలో మాత్రం దొరికింది చిన్న ప్లాట్ అయినా కూడా ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు సంపాదించుకుంది. నెట్టింట ఇప్పుడు అందరూ మాన్సీ తక్షక్ గురించే మాట్లాడుతున్నారు. మాన్సీకి యానిమల్ సినిమాతో సందీప్ వంగా మంచి బ్రేక్ ఇచ్చాడనే చెప్పాలి. పార్ట్ 1లో పాత్ర లిమిటెడ్ గా ఉన్నా కూడా.. పార్ట్ 2లో కూడా మాన్సీ క్యారెక్టర్ కొనసాగే విధంగానే ఉంది. కాబట్టి యానిమల్ పార్ట్ 2తో మాన్సీకి మంచి ఛాన్స్ వస్తుందనే చెప్పాలి. అలాగే బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు దక్కేలా ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mansi Taxak (@mansi_taxak)

మాన్సీ కూడా హీరోయిన్ మెటీరియల్ కాబట్టి.. మంచి అవకాశాలు దొరికితే కచ్చితంగా మంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎదిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఆమెకు సోషల్ మీడియాలో కూడా అంతంతమాత్రంగానే ఫాలోయింగ్ ఉంది. కానీ, రాబోయే కొద్ది రోజుల్లో ఆ రీచ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మాన్సీ కూడా తనలాంటి ఔత్సాహికులను ఇన్ ఫ్లుఎన్స్ చేస్తూ ఉంటుంది. “నేను ఐదేళ్ల క్రితం వరకు అసలు యాక్టర్ అవుతాను అని కూడా అనుకోలేదు. కానీ, భగవంతుడి దయ వల్ల నేను ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో చేస్తున్నాను. ఎవరైనా ఒకటి సాధించాలి అంటే హార్డ్ వర్క్, సహనం కలిగి ఉండాలి” అంటూ మాన్సీ తన ఫాలోవర్స్, అభిమానులను ఇన్ ఫ్లుఎన్స్ కూడా చేస్తోంది. మరి.. అబ్రార్ మూడో భార్యగా చేసిన మాన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mansi Taxak (@mansi_taxak)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş