iDreamPost
android-app
ios-app

Animal Movie ఓపెనింగ్స్.. ఇందుకే దిల్ రాజు అందరికన్నా స్పెషల్!

యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు నుంచే యానిమల్‌ రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు, హిందీల్లో భారీ స్థాయిలో..

యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు నుంచే యానిమల్‌ రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు, హిందీల్లో భారీ స్థాయిలో..

Animal Movie ఓపెనింగ్స్.. ఇందుకే దిల్ రాజు అందరికన్నా స్పెషల్!

యానిమల్‌ సినిమా రేపు ( డిసెంబర్‌ 1వ తేదీ)న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందునుంచే ఆన్‌లైన్‌ ఆడ్వాన్స్‌ బుకింగ్‌లు మొదలయ్యాయి. భారత్‌తో పాటు చాలా దేశాల్లో సినిమా విడుదల కాబోతోంది. దీంతో అక్కడ కూడా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. విదేశాల్లో యానిమల్‌ క్రేజ్‌ చూస్తుంటే మతిపోతోంది. ఇక, అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో యానిమల్‌ రికార్డులు సృష్టిస్తోంది.

అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రికార్డు స్థాయిలో జరిగాయి. అమెరికాలో మొదటిరోజు బుకింగ్స్‌ దాదాపు 3 మిలియన్లకు పైగా నమోదయ్యాయి. తెలుగు, హిందీ రెండు భాషలకు సంబంధించి ఈ రికార్డు క్రియేట్‌ అయింది. ప్రీమియర్స్‌తో పాటు మొదటి రోజుకు సంబంధించి ఓవర్‌సీస్‌లో దాదాపు 6 మిలియన్ల బుకింగ్స్‌ నమోదయ్యాయి. భారత దేశంలో కూడా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో యానిమల్‌ పాత రికార్డులను తిరగరాస్తోంది.

కాగా, తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఇక, తెలుగులో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో యానిమల్‌ దూసుకుపోతోంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడుతోంది. యానిమల్‌ సినిమాను దిల్‌ రాజు 15 కోట్ల రూపాయలకు కొన్నట్లు తెలుస్తోంది. సీడెడ్‌, నైజాం, ఆంధ్ర ప్రాంతాలకు కలిపి ఈ మొత్తం ఇచ్చారు. చిత్రం బ్రేక్‌ అవ్వాలంటే.. 16 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రీ బుకిం​గ్స్‌ చూస్తుంటే.. రెండు, మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే అవకాశం ఉంది.

ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఇప్పటికే స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌ ఓకే అయినట్లు తెలుస్తోంది. తెలుగులో ఆహా యానిమల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నుట్లు సమాచారం. యానిమల్‌ థియేటర్లలో 3:21 నిమిషాల నిడివితో విడుదల కానుంది. కానీ, ఓటీటీ విషయంలో మార్పు ఉండనుంది. థియేటర్లలో కంటే ఓ అరగంట ఎక్స్‌ట్రాగా స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ఈ నేపథ్యంలోనే యానిమల్‌కు సీక్వెల్‌ ఉండనుందన్న వార్తలకు బలం చేకూరుతోంది. దానికితోడు మొన్న జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో..

ఎండింగ్‌ను అస్సలు మిస్‌ అవ్వొద్దని అన్నారు. దీంతో సీక్వెల్‌ వార్తలు మరింత పెరిగాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ.. చిత్రంలో హై ఇచ్చే సీన్లు 20 నుంచి 25 దాకా ఉంటాయని అన్నారు. అర్జున్‌ రెడ్డి ఇంటర్‌వెల్‌ సీన్‌లాంటి సీన్లు మళ్లీ రావని చెప్పారు. యానిమల్‌ సినిమా మొదటినుంచి చివరి వరకు సూపర్‌గా ఉంటుందని చెప్పారు. మరి, యానిమల్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో క్రియేట్‌ చేస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.