iDreamPost
android-app
ios-app

Animal: యానిమల్ ఎక్కడా తగ్గట్లేదుగా.. రెండో రోజు కలెక్షన్ ఎంతంటే..?

  • Published Dec 03, 2023 | 12:32 PM Updated Updated Dec 03, 2023 | 3:07 PM

యానిమల్ మూవీతో ధియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కాసుల వర్షం కురుస్తుంది. శుక్ర, శనివారాల్లో భారీగా వసూళ్లను చేసింది ఈ చిత్రం. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 115 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. రెండవ రోజు..

యానిమల్ మూవీతో ధియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కాసుల వర్షం కురుస్తుంది. శుక్ర, శనివారాల్లో భారీగా వసూళ్లను చేసింది ఈ చిత్రం. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 115 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. రెండవ రోజు..

  • Published Dec 03, 2023 | 12:32 PMUpdated Dec 03, 2023 | 3:07 PM
Animal: యానిమల్ ఎక్కడా తగ్గట్లేదుగా.. రెండో రోజు కలెక్షన్ ఎంతంటే..?

ప్రస్తుతం దేశం మొత్తం తన పేరు గుర్తిండిపోయేలా చేశాడు దర్శకుడు ‘సందీప్ రెడ్డి వంగా’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ చిత్రం అందరి అంచనాలను నిలబెట్టుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ను తన సొంతం చేసుకుంది ఈ చిత్రం. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ యానిమల్ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును దాటేసింది. ఈ మూవీని 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇక విడుదలైన మొదటి రోజునే భారతదేశంలో రూ.71 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మరి రెండవ రోజు ఈ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

అంచనాల ప్రకారం.. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 210 కోట్ల షేర్, 400 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంది. తొలి రోజు ఇండియాలోనే రూ.71 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో సుమారుగా 45 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా యానిమల్ సినిమా ఫస్ట్ డే రూ.116 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా సమాచారం. ఈ సంవత్సరంలో వంద కోట్లు దాటిన బాలీవుడ్ చిత్రాల్లో మూడవదిగా నిలిచింది యానిమల్ మూవీ. తండ్రీ కొడుకుల అనుబంధంతో తెరకెక్కిన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక సెకండ్ డే కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ మూవీ ఇండియాలో ₹ 60.92 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. గ్లోబల్ వైజ్‌గా రూ. 129 కోట్లకు పైగా కొల్లగొట్టింది.

ఈ రెండు రోజుల్లో ‘యానిమల్’ మూవీ ఓవరాల్‌గా 230 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఆదివారం నాడు బాక్సాఫీసు వద్ద కాసుల కళకళ లాడటం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదూ.. పాన్ ఇండియా మొత్తం థియేటర్లు దద్ధరిల్లుతున్నాయి. ఈ సినిమా రణబీర్ కెరీర్ లోనే బిగ్గెట్ హిట్ అండ్ హయ్యర్ కలెక్షన్లని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డిపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగాయి. ఇక బాబీడియోల్ నటన పట్ల ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఇటీవల ఆయన కంటతడి పెడుతూ తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఆదివారం కూడా సినిమా బుకింగ్స్ అయిపోనట్లు తెలుస్తోంది. ఇక వచ్చే వారానికి టార్గెట్ కు మించి కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom