iDreamPost
android-app
ios-app

Tripti Dimri: యానిమల్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్.. ఏకంగా 400 కోట్ల ప్రాజెక్టులో..!

  • Published Dec 07, 2023 | 6:17 PM Updated Updated Dec 07, 2023 | 6:17 PM

సినిమా రిలీజ్ అయ్యాక ఎవరికి ఏ స్థాయి గుర్తింపు లభిస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ఒక అవకాశం యానిమల్ బ్యూటీ తృప్తీకి దక్కింది. ఇప్పుడు ఆమె పేరు మరో బిగ్ ప్రాజెక్టులో కూడా వినిపిస్తోంది.

సినిమా రిలీజ్ అయ్యాక ఎవరికి ఏ స్థాయి గుర్తింపు లభిస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ఒక అవకాశం యానిమల్ బ్యూటీ తృప్తీకి దక్కింది. ఇప్పుడు ఆమె పేరు మరో బిగ్ ప్రాజెక్టులో కూడా వినిపిస్తోంది.

  • Published Dec 07, 2023 | 6:17 PMUpdated Dec 07, 2023 | 6:17 PM
Tripti Dimri: యానిమల్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్.. ఏకంగా 400 కోట్ల ప్రాజెక్టులో..!

యానిమల్ సినిమా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ గా మారింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం రూ.516 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తోంది. అంతేకాకుండా కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి ఔరా అనిపిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్టామినా ఏంటో తెలిసొచ్చేలా చేసింది. అయితే ఈ మూవీ ద్వారా పాపులర్ అయిన వారిలో తృప్తి ధిమ్రీ కూడా ఒకరు. ఆమె గతంలో హీరోయన్ గా సినిమాలు చేసినప్పటికీ యానిమల్ తోనే పేరొచ్చింది. అంతేకాదు ఇప్పుడు భారీ ఆఫర్ కూడా వచ్చింది.

సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత ఎవరికి పేరొస్తుంది? ఎలా గుర్తింపు వస్తుందో ఎవరూ చెప్పలేరు. నిజానికి హీరో, హీరోయిన్ కి పేరొస్తుందని అందరికీ తెలుసు. కానీ, వారికంటే కూడా సపోర్టింగ్ రోల్స్ చేసిన వారికే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వస్తుంటాయి. కనిపించింది ఒక్క సీన్ అయినా కూడా ఆడియన్స్ కి నచ్చితే మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. అలా ఇప్పుడు తృప్తీ ధిమ్రీకి సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ వచ్చేసింది. యానిమల్ చిత్రంలో రష్మికా మందన్నా తర్వాత మరో హీరోయిన్ పాత్రలో తృప్తీ కనిపించింది. ఆమె చేసిన జోయా పాత్రకు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ లభించింది. సెకండాఫ్ లో ఆమె కొన్ని కీలక సన్నివేశాల్లో నటించింది. అంతేకాకుండా యానిమల్ పార్ట్ 2లో కూడా ఆమెకు కీలక పాత్ర ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

అది కూడా అలాంటి ఇలాంటి ప్రాజెక్టు కాదు ఏకంగా రూ.400 కోట్ల ప్రాజెక్టులో తృప్తీ ధిమ్రీకి ఛాన్స్ దక్కిందంటూ ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంత భారీ ప్రాజెక్ట్ అనగానే అందరికీ సందీప్ రెడ్డి వంగా పేరే గుర్తొస్తోంది. ప్రభాస్- సందీప్ వంగా కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ చిత్రంలో కూడా తృప్తీ ధిమ్రీకి ఛాన్స్ దక్కిందని టాక్ నడుస్తోంది. అయితే స్పిరిట్ చిత్రంలో తృప్తీ పాత్రపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే కెరీర్ లో మంచి మంచి పాత్రలు చేసిన తృప్తీకి స్పిరిట్ అవకాశం దక్కితే కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. 2017లో యాక్టింగ్ ప్రారంభించిన తృప్తీకి ఇంకా స్టార్ హీరోయిన్ అనే హోదా.. దక్షిణాదిన గుర్తింపు రాలేదు. ప్రభాస్ సరసన సరైన పాత్ర దొరికితే మాత్రం తృప్తీకి ఆ రెండూ వచ్చేస్తాయి. మరి.. తృప్తీ ధిమ్రీకి సందీప్ వంగా– ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో ఛాన్స్ దొరికిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş