iDreamPost
android-app
ios-app

శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ హీరో అనీల్ కపూర్

  • Published Oct 06, 2023 | 3:51 PM Updated Updated Oct 06, 2023 | 3:51 PM
  • Published Oct 06, 2023 | 3:51 PMUpdated Oct 06, 2023 | 3:51 PM
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ హీరో అనీల్ కపూర్

దేశంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి. తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి నిత్యం వేలాది భక్తులు తరలి వెళ్తుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.  స్వామి వారిని దర్శించుకోవడానికి సినీ సెలబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు విచ్చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్ స్వామి వారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు క్యూ కడుతుంటారు. ప్రముఖ బాలీవుడ్ హీరో అనీల్ కపూర్ శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి దేవస్థానం అధికారులు అనీల్ కపూర్ కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు అనీల్ కపూర్.

ఈ రోజు అనీల్ కపూర్ నిర్మించిన ‘థాంక్యూ ఫర్ కమింగ్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నారు అనీల్ కపూర్. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. ‘థాంక్యూ ఫర్ క‌మింగ్’మూవీతో రియా కపూర్ భర్త కరణ్ బులానీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షెహనాజ్ గిల్, అనీల్ కపూర్, కుషా కపిల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా అనీల్ కపూర్ మాట్లాడుతూ.. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని, మనశ్శాంతని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet