iDreamPost
android-app
ios-app

నాన్న ఉండగానే.. లైంగిక వేధింపులు! ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 04, 2024 | 5:42 PM Updated Updated Mar 04, 2024 | 5:53 PM

ఇటీవల మహిళలు ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య లైంగిక వేధింపులు. ఇంటి దగ్గరే కాదూ ప్రతి ప్రదేశాల్లో ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొంటున్నారు. సామాన్యులే కాదూ.. సెలబ్రిటీలు కూడా..

ఇటీవల మహిళలు ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య లైంగిక వేధింపులు. ఇంటి దగ్గరే కాదూ ప్రతి ప్రదేశాల్లో ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొంటున్నారు. సామాన్యులే కాదూ.. సెలబ్రిటీలు కూడా..

  • Published Mar 04, 2024 | 5:42 PMUpdated Mar 04, 2024 | 5:53 PM
నాన్న ఉండగానే.. లైంగిక వేధింపులు! ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

లైంగిక వేధింపులు.. ప్రస్తుతం మహిళల్ని, అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. పని ప్రదేశాల్లోనే కాదూ.. ఇంట్లో కూడా దీనికి బాధితులవుతున్నారు. చిన్న పాప నుండి కాటికి కాళ్లు చాపే ముదసలి వరకు ఎవర్నీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. జైలు, చట్టాలు, న్యాయ స్థానాల శిక్షలకు కూడా లొంగడం లేదు. బయటకు అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నారు ఆడపిల్లలు. దీనికి సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం అతీతులు కారు. గతంలో కూడా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి స్టార్ నటీమణులు, సింగర్స్ బహిర్గతం చేశారు. ఇప్పుడు సింగర్ కమ్ నటి తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను కూడా ఈ సెక్సువల్ అబ్యూస్ బాధితురాలినని చెబుతోంది.

అదీ కూడా నాన్న పక్కన ఉన్న సమయంలోనే ఇలాంటి దారుణమైన చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదూ.. సింగర్ నుండి హీరోయిన్‍గా ఎదిగిన నటి ఆండ్రియా జెర్మీయా. తెలుగులో చేసినవీ.. ఫింగర్ టిప్స్‌పై లెక్కట్టే సినిమాలే అయినా.. తమిళ డబ్బింగ్ మూవీలతో కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యుగానికి ఒక్కడు, మాస్టర్, విశ్వరూపం వంటి చిత్రాలతో అలరించింది. తెలుగులో బొమ్మరిల్లు, రాఖీలో ‘జర జర పాకే విషంలా’ మొదలై.. మొన్న వచ్చిన మంత్ ఆఫ్ మధు వరకు అనే చిత్రాలకు గాత్రం అందించింది ఆండ్రియా. అంతేకాకుండా నటిగానూ దూసుకెళుతుంది. హీరోయిన్‌గా మారి.. తమిళంలో అనేక సినిమాలు చేసింది.

టాలీవుడ్‌లో కేవలం రెండంటే.. రెండు సినిమాలు మాత్రమే చేసింది. అప్పుడెప్పుడో.. సునీల్ సరసన.. తఢాఖా మూవీలో కనిపించిన ఈ అమ్మడు.. మళ్లీ పదేళ్ల తర్వాత.. వెంకటేష్ సైంధవ్‌లో యాక్ట్ చేసింది. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ టాలెంట్ బ్యూటీ.. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. ‘నేను 11 సంవత్సరాలు ఉన్నప్పుడు.. నాన్నతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను. నేను అప్పుడు జీన్స్, టీ షర్ట్ వేసుకున్నాను. నేను నాన్నకు కొంచెం దూరంలో మరో సీట్లో కూర్చుకున్నాను. అంతలో ఎవరో టీ షర్టులో నుండి లోపలికి చేయి పెట్టినట్లు అనిపించింది. ఆ కంగారులో నాకేం చేయాలో తోచలేదు. భయంతో నాన్న పక్కన వచ్చి కూర్చున్నారు. ఈ విషయం ఎవరికీ ఎందుకు చెప్పలేదో కూడా నాకు తెలియదు. కానీ ఆ సమయంలో నేను ఏడ్చేశాను’ అని చెప్పింది ఆండ్రియా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom