iDreamPost
android-app
ios-app

ఆ డైరెక్టర్ నన్ను గదిలోకి పిలిచి.. బెడ్ పైకి తోశాడు: వర్షిణి

  • Author Soma Sekhar Published - 07:55 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 07:55 PM, Thu - 10 August 23
ఆ డైరెక్టర్ నన్ను గదిలోకి పిలిచి.. బెడ్ పైకి తోశాడు: వర్షిణి

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు, నటీమణులు ఎదుర్కొనే ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. రంగుల ప్రపంచంలో స్టార్ గా వెలుగొందాలనే కలతో ఎంతో మంది తారలు పరిశ్రమకు వస్తుంటారు. అలాంటి వారి వీక్ నెస్ ను ఆసరాగా చేసుకుని వారిని వాడుకోవాలని చూస్తూ ఉంటారు కొందరు. ఇక ఇటీవలే సీనియర్ హీరోయిన్ ఆమని కూడా తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమని చెప్పుకొచ్చారు. తాజాగా మరో నటి తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు బుల్లితెర యాంకర్ వర్షిణి సౌందరరాజన్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.

యాంకర్ వర్షిణి.. తన అందంతో, చలాకీ తనంతో, అమయాకత్వంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఢీ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ఎన్నో షోలకు యాంకరింగ్ అవకాశాలను కొట్టేసింది ఈ బ్యూటీ. బుల్లితెరపై తన కో-స్టార్స్ తో వర్షిణి చేసే సందడి అంతా.. ఇంతా కాదు. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల కళ్లకు నిద్ర కరువు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటు బుల్లితెరతో పాటుగా వెండితెరపై కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంది ఈ సోయగం.

వర్షిణి మాట్లాడుతూ..” లాక్ డౌన్ కు ముందు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ డైరెక్టర్ ఆడిషన్స్ కోసం నన్ను హోటల్ కు రమ్మన్నాడు. ఆడిషన్ మెుత్తం అయిపోయిన తర్వాత సూపర్ గా చేశావ్ అంటూ పొగిడాడు. ఈ వెబ్ సిరీస్ కు నువ్వు బాగా సూటవుతావు అన్నాడు. దీంతో నేను ఈ సిరీస్ లో కన్ఫాం అనుకున్నా. ఆ తర్వాత నన్ను రూమ్ లోకి రమ్మన్నాడు. నా చేయి పట్టుకుని బెడ్ పైకి లాగి.. నా డ్రెస్ విప్పమన్నాడు” అంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది వర్షిణి.

కాగా.. ఈ పరిణామానికి భయపడిన వర్షిణి వెంటనే అతడిని విడిపించుకుని బయటకి వచ్చేసిందట. జరిగిన దాన్ని తల్చుకుని చాలాసేపు ఏడ్చి.. ఇది తన జీవితంలో చీకటి రోజు అంటూ చెప్పుకొచ్చింది. ఇక నా జీవితంలో ఎదురైన అతి భయంకరమైన చేదు అనుభవం ఇదొక్కటే అంటూ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది వర్షిణి. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం బయటపెట్టలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ వర్షిణి చేసిన వ్యాక్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి.. GPSతో ‘భోళా శంకర్’!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet