iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రైవేట్ యాచ్ట్ లో పార్టీ.. శ్రీముఖి రిచ్ లైఫ్ మామూలుగా లేదుగా!

  • Author Soma Sekhar Published - 02:44 PM, Fri - 30 June 23
  • Author Soma Sekhar Published - 02:44 PM, Fri - 30 June 23
వీడియో: ప్రైవేట్ యాచ్ట్ లో పార్టీ.. శ్రీముఖి రిచ్ లైఫ్ మామూలుగా లేదుగా!

సెలబ్రిటీ లైఫ్ అంటేనే లగ్జరీ లైఫ్. మరి అలాంటి సెలబ్రిటీలు స్పెషల్ డేలను ఇంకెంత లగ్జరీగా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బర్త్ డే, మ్యారేజ్ డే, పిల్లల బర్త్ డేలను తమ జీవితాంతం గుర్తుంచుకునే విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలా తన బర్త్ డేని చాలా స్పెషల్ గా ఎంజాయ్ చేసింది బుల్లితెర రాములమ్మ శ్రీముఖి. బ్యాంకాక్ టూర్ లో తన పుట్టిన రోజును చాలా లగ్జరీగా.. కొద్ది మంది సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. హీరోయిన్ రేంజ్ లో బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది బుల్లితెర రాములమ్మ.

శ్రీముఖి.. బుల్లితెర రాములమ్మగా తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన యాంకరింగ్ తో.. తన అందంతో కోట్లలో అభిమానులను సంపాదించుకుంది. బుల్లితెరపై ఎన్నో షోలకు యాంకరింగ్ చేసిన ఈ బొద్దు గుమ్మ.. తాజాగా 30వ పడిలోకి అడుగుపెట్టింది. మే 10న తన పుట్టినరోజు కావడంతో.. ఈ వేడుకలను చాలా సింపుల్ గా చేసుకుంది. ఇక్కడ సింపుల్ అంటే హంగూ ఆర్భాటాలు లేకుండా అని. అంతే తప్ప ఖర్చు తక్కువ అని కాదు. ఇక శ్రీముఖి తాజాగ చేసుకున్న బర్త్ డే సెలబ్రేషన్స్ చూస్తే మతిపోవాల్సిందే. హీరోయిన్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఆమె ఈ పార్టీని చేసుకుంది. ఈ వీడియోను తన యూట్యూబ్ లో తాజాగా అప్లోడ్ చేసింది శ్రీముఖి.

బ్యాంకాక్ లో తన పుట్టిన రోజు వేడుకలను అతి కొద్ది మంది సమక్షంలో జరుపుకుంది. ఓ ప్రైవేట్ యాచ్ట్ లో సింగిల్ గా ఎంజాయ్ చేస్తూ.. అక్కడి సిబ్బందిని తన పంచులతో సరదాగా ఆడుకుంది. ప్రయివేట్ ఐలాండ్ తో సరదాగా బోటు షికారు చేస్తూ.. ఫుల్ ఎంజాయ్ చేసింది. సముద్రంలోనే బోటులో ఫ్రూట్స్ తో చేసిన కేక్ తో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. ఇక వీడియో చివరలో హాట్ డ్రెస్ తో తళుక్కున మెరిసింది ఈ భామ. ఈ బర్త్ డే నా జీవితంలోనే మర్చిపోలేనిదిగా చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా.. లైఫ్ ను ఎంజయ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio