iDreamPost
android-app
ios-app

హీరోను చాచి పెట్టి కొట్టిన యాంకర్ శ్రీముఖి.. ఎందుకంటే..?

  • Published Mar 21, 2024 | 5:28 PM Updated Updated Mar 21, 2024 | 5:28 PM

యాంకర్ శ్రీముఖికి సామాన్యంగా కోపం రాదు. బుల్లి తెర రాములమ్మగా అందర్నీ అలరించే ఈ బ్యూటీకి కోపం వచ్చింది. హీరోపై చేయి చేసుకుంది. ఇంతకు అతడు ఏం చేశాడు.. ఆమె ఎందుకు చెంప పగుల కొట్టిందంటే..?

యాంకర్ శ్రీముఖికి సామాన్యంగా కోపం రాదు. బుల్లి తెర రాములమ్మగా అందర్నీ అలరించే ఈ బ్యూటీకి కోపం వచ్చింది. హీరోపై చేయి చేసుకుంది. ఇంతకు అతడు ఏం చేశాడు.. ఆమె ఎందుకు చెంప పగుల కొట్టిందంటే..?

  • Published Mar 21, 2024 | 5:28 PMUpdated Mar 21, 2024 | 5:28 PM
హీరోను చాచి పెట్టి కొట్టిన యాంకర్ శ్రీముఖి.. ఎందుకంటే..?

తెలుగు బుల్లితెరపై రాములమ్మగా హవా సాగిస్తోన్న యాంకరమ్మ శ్రీముఖి. పలు ఎంటర్‌టైన్ మెంట్ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ చేస్తోంది. శ్రీముఖికి అంత త్వరగా కోపం రాదు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే ఆమెకు కోపం తెప్పించాడు యంగ్ హీరో. దీంతో ఈమె చేతిలో తన్నులు తిన్నాడు అతగాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఆ నటుడు. తన సినిమా ప్రమోషన్ చేసుకుందామని వస్తే లాగి.. ఒక్కటి ఇచ్చుకుంది. అయితే ఇది కూడా సినిమా ప్రమోషన్లలో భాగమని తెలుస్తోంది. ఇంతకు అతడు ఎవరంటే.. నూకరాజు అలియాస్ పార్వతీశం. ఇలా చెబితే అర్థం కాదూ.. కానీ..

యూత్ ఎంటర్ టైన్ మెంట్, కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. దిల్ రాజుకు సంబంధించిన ఈ బ్యానర్‌లో ఎంతో మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. వారిలో ఒకరు నూకరాజు అలియాస్ పార్వతీశం. కేరింత మూవీలో గోల గోల ఏంటీ (గోల్ కు వచ్చిన తిప్పలు) అంటూ చివరిలో భావనా అంటూ శ్రీకాకుళం భాషలో అలరించిన నూకరాజు గుర్తున్నాడు కదా. అతడే.. ఈ పార్వతీశం. ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టాశాడు. ఇప్పుడు ఆ యంగ్ హీరో సినిమా రిలీజ్ కాబోతుంది. అదే మార్కెట్ మహాలక్ష్మి. బీ2పీ స్టూడియోస్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడు.. కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చెప్పే కధాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సందర్భంగా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. ఇందులో హీరోయిన్ పేరు మహాలక్ష్మి కావడంతో.. ఆ పేరు ఉన్న వాళ్లకి ఫ్రీగా టికెట్స్ ఇస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. సుమారు 200 మందికి టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 29న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తన ప్రమోషన్లలో భాగంగా శ్రీముఖి దగ్గరకు వెళ్లిన పార్వతీశం.. ‘మీరంటే నాకు చాలా ఇష్టమండి’ అనగానే.. లాగి చెంపపై ఒక్కటి పీకింది యాంకరమ్మ. అంతలో‘ హే.. మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు’ అని సినిమాలోని డైలాగ్ చెప్పింది. సో దీన్నిబట్టి చూస్తే ఇదొక ప్రమోషన్ స్టంట్ అని తెలుస్తోంది. పార్వతీశం నేను , నా బాయ్ ఫ్రెండ్స్, రోజులు మారాయి, భలే మంచి చౌక బేరం, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, ఏ1 ఎక్స్ ప్రెస్, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, జగన్నాటకం, గమ్మత్తు వంటి చిత్రాల్లో నటించాడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş