iDreamPost
android-app
ios-app

తల్లిదండ్రులకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన శ్రీముఖి! ఏమిచ్చిందంటే?

  • Author Soma Sekhar Published - 04:13 PM, Fri - 17 November 23

శ్రీముఖి తన తల్లిదండ్రులకు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇంతకీ బుల్లితెర రాములమ్మ ఇచ్చిన ఆ బహుమతులు ఏవో ఇప్పుడు చూద్దాం.

శ్రీముఖి తన తల్లిదండ్రులకు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇంతకీ బుల్లితెర రాములమ్మ ఇచ్చిన ఆ బహుమతులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 04:13 PM, Fri - 17 November 23
తల్లిదండ్రులకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన శ్రీముఖి! ఏమిచ్చిందంటే?

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు ఉన్నప్పటికీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటారు. అలాంటి వారిలో ముందువరుసలో ఉంటారు యాంకర్ సుమ. ఇక ఆ తర్వాత యాంకరింగ్ లో మళ్లీ అంతటి క్రేజ్ ను సాంపదించుకుంది శ్రీముఖి. బుల్లితెర రాములమ్మగా ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఈ ముద్దుగుమ్మ.. షోలతో పాటుగా పలు సినిమాలు చూస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికీ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి తన తల్లిదండ్రులకు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది.

శ్రీముఖి.. చలాకీ మాటలతో, హుషారైన యాంకరింగ్ తో తనకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా నిలిచి తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది. ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో నటిస్తూ.. దూసుకెళ్తోంది. ఇటీవలే వచ్చిన మెగాస్టార్ భోళా శంకర్ మూవీలో ఖుషీ మూవీ నడుము సీన్ రీమిక్స్ లో యాక్ట్ చేసి.. మెస్మరైజ్ చేసింది ఈ బుల్లితెర రాములమ్మ. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. దీపావళి పండగను నిజామాబాద్ లోని తన కొత్తింట్లో కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది శ్రీముఖి. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది.

ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు ఖరీదైన బహుమతులు ఇచ్చింది. తండ్రి రామకృష్ణకు బంగారు చైన్, తల్లి లతకు డైమండ్ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది చూసిన వారిద్దరు ఒక్కసారిగా షాకైయ్యారు. ఊహించని గిఫ్ట్ తో తన తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది శ్రీముఖి. ఒకప్పుడు మేమంతా ఒకే గదిలో ఉండేవాళ్లమని, ఇప్పుడు ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో ఈ స్థాయికి వచ్చామని శ్రీముఖి చెప్పుకొచ్చింది. నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు మా తరఫున ఇది చిన్న గిఫ్ట్ అంటూ వారి ఆశీర్వాదం తీసుకున్నారు శ్రీముఖి ఆమె తమ్ముడు శుశ్రుత్. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మరి తల్లిదండ్రులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన శ్రీముఖిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom