iDreamPost
android-app
ios-app

యాంకర్ శివజ్యోతిపై దారుణమైన కామెంట్స్! అక్కా అక్కా అంటూనే..

  • Author ajaykrishna Published - 10:19 AM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 10:19 AM, Sat - 22 July 23
యాంకర్ శివజ్యోతిపై దారుణమైన కామెంట్స్! అక్కా అక్కా అంటూనే..

సాధారణంగా టాలెంట్ ఉన్నవారిని నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లకుండా ఆపగలరేమో గానీ.. వాళ్ల టాలెంట్ ని మాత్రం ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఒకచోట కాకపోయినా ఏదొక రోజు, వేరే చోటనైనా సక్సెస్ అవుతుంటారు. అయితే.. సెలబ్రిటీలుగా పాపులర్ అయ్యేవరకు ఎంత కష్టపడతారో వారికే తెలుసు. కానీ.. ఒకసారి సెలబ్రిటీ హోదా వచ్చాక పరిస్థితులు మారిపోతాయి. పేరుతో పాటు అదే రేంజ్ లో విమర్శలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం సెలబ్రిటీగా పాపులర్ అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. కెరీర్ పరంగా కాకుండా పర్సనల్ లైఫ్ పరంగా కామెంట్స్ ఫేస్ చేస్తోంది తీన్మార్ సావిత్రి అలియాస్ యాంకర్ శివజ్యోతి.

శివజ్యోతి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మొదట ప్రముఖ న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు చదివిన సావిత్రిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని.. సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికీ చాలామంది శివజ్యోతి అంటే గుర్తు పట్టకపోవచ్చు. కానీ.. తీన్మార్ సావిత్రి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అచ్చమైన తెలంగాణ భాష, యాసలను చక్కగా తన మాటలతో ప్రెజెంట్ చేసి.. మంచి పేరు తెచ్చుకుంది సావిత్రి. అయితే.. ఎప్పుడైతే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిందో.. అప్పటినుండి జాబ్స్ అన్ని మానేసి.. తన సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్లాగ్స్ చేస్తోంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది జ్యోతి.

ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని.. సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాక.. గతంలో కంటే ట్రెండీగా.. మోడరన్ గా తయారైంది జ్యోతి. భర్త గంగూలీతో కలిసి అప్పుడప్పుడు పోస్టులు, సరదా వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా జ్యోతి వీడియోలలో భర్త గంగూలీ మాత్రం పక్కాగా ఉంటాడు. రీసెంట్ గా బోనాల వీడియో పోస్టు చేస్తూ.. మా ఆయన బంగారం కొనిచ్చాడు అని చెప్పింది. అప్పటినుండి జ్యోతి భర్తపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అక్క మీ ఆయన ఏం జాబ్ చేస్తాడు? అక్క మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అతను ఏం చేస్తాడు అనే విషయం పక్కన పెడితే.. భార్యను దగ్గరుండి చూసుకుంటున్నాడు అని కొందరు జ్యోతికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే.. ఇదివరకే చాలాసార్లు జ్యోతి తన భర్త గురించి, వాళ్ల లైఫ్ చెబుతా ఎమోషనల్ అయింది. అయినా అక్కా అక్కా అంటూ ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. సో.. జ్యోతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio