iDreamPost
android-app
ios-app

Anchor Rashmi: వీడియో: కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ? కుర్రాడు భలే ఉన్నాడు!

  • Published Dec 29, 2023 | 12:59 PM Updated Updated Dec 29, 2023 | 1:14 PM

న్యూ ఇయర్ సందర్భంగా 'రష్మి పెళ్లి పార్టీ' అనే పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈ వెంట్ లో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది రష్మీ.

న్యూ ఇయర్ సందర్భంగా 'రష్మి పెళ్లి పార్టీ' అనే పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈ వెంట్ లో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది రష్మీ.

  • Published Dec 29, 2023 | 12:59 PMUpdated Dec 29, 2023 | 1:14 PM
Anchor Rashmi: వీడియో: కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ? కుర్రాడు భలే ఉన్నాడు!

యాంకర్ రష్మీ.. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. అయితే యాంకరింగ్ కంటే ముందుగానే టాలీవుడ్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. చాలా చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు. అలాంటి టైమ్ లో ‘జబర్దస్త్’ కామెడీషోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వెనక్కితిరిగి చూసుకోలేదు ఈ భామ. అద్భుతమైన యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తో పాటు గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఈ షోతోనే రష్మీ-సుధీర్ జోడీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాపులారిటీతోనే సినిమా ఆఫర్లను పట్టేసింది ఈ యాంకరమ్మ. కాగా.. తన పెళ్లి వార్తలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రష్మీ. సుధీర్-రష్మీలు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గతంలో చాలా సార్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ అవన్నీ రూమర్లే అని తర్వాత తేలింది. అయితే తాజాగా న్యూ ఇయర్ స్పెషల్ ఈ వెంట్ లో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది రష్మీ.

న్యూ ఇయర్ సందర్భంగా ‘రష్మి పెళ్లి పార్టీ’ అనే పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన ప్రోను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్ ఎప్పటిలాగే ఎంతో హుషారుగా సాగింది. డ్యాన్స్ మాస్టర్ పండు ముగ్గురు ముద్దుగుమ్మలతో చేసిన హాట్ ఫర్ఫామెన్స్ హైలెట్. శ్రీసత్య, చమ్మక్ చంద్రల జోడీ మెస్మరైజింగ్ డ్యాన్స్ లతో అదరగొట్టారు. కామెడీ స్కిట్ల గురించి ఇక ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే హైపర్ ఆది ఓ ప్రశ్నను లేవనెత్తాడు.”ఇన్ని రోజులుగా నువ్వు టీఆర్పీ రేటింగ్స్ కోసం అన్నీ చేశావు. కానీ ఇప్పుడు నిజం చెప్పు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? అతడిని మేము చూడాలనుకుంటున్నాము” అని అడిగాడు.

కాగా.. ఆది ప్రశ్నకు రష్మి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చింది.’కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతీ అమ్మాయి అనుకుంటుంది. నాక్కూడా కాబోయేవాడు ఇలా ఉండలని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి’ అని చెబుతుండగానే.. అంతలోనే వెనకనుంచి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడే రష్మిని పెళ్లి చేసుకోబోయేవాడు అని ప్రోమోని బట్టి అర్దం అవుతుంది. అతడి గురించి ఏ వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా ఎప్పటిలాగే టీఆర్పీ స్టంట్ లో భాగమేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కుర్రాడు మాత్రం భలే ఉన్నాడు, మంచి అబ్బాయినే పట్టింది రష్మి అంటూ కితాబిస్తున్నారు. మరి ఇది టీఆర్పీ స్టంట్ లో భాగమా?లేదా నిజమా? అని తెలియాలి అంటే డిసెంబర్ 31 రాత్ర 9.30 నిమిషాల వరకు ఆగాల్సిందే. దీంతో ఈ స్పెషల్ ఈవెంట్ కోసం ఎంతో మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş