iDreamPost
android-app
ios-app

భర్త చేతిలో తన్నులు తిన్న యాంకర్‌ లాస్య.. ఆ విషయంలోనే గొడవంట

  • Published Feb 08, 2024 | 3:08 PM Updated Updated Feb 08, 2024 | 3:34 PM

Anchor Lasya: యాంకర్‌ లాస్య షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీనిలో ఆమె భర్త.. లాస్య మీద చేయి చేసుకుంటున్నాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..

Anchor Lasya: యాంకర్‌ లాస్య షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీనిలో ఆమె భర్త.. లాస్య మీద చేయి చేసుకుంటున్నాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Feb 08, 2024 | 3:08 PMUpdated Feb 08, 2024 | 3:34 PM
భర్త చేతిలో తన్నులు తిన్న యాంకర్‌ లాస్య.. ఆ విషయంలోనే గొడవంట

యాంకర్‌ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనేక షోలకు వ్యాఖ్యతగా చేసి.. ప్రేక్షకులను మెప్పించింది. మరీ ముఖ్యంగా యాంకర్‌ రవితో కలిసిన చేసిన షోలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. అప్పట్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిని బ్రేక్‌ చేస్తూ.. లాస్య.. మంజునాథ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తామిద్దరం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది. వివాహం తర్వాత కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది. కూల్‌ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమైన లాస్య.. తన ఫోకస్‌ మొత్తం సోషల్‌ మీడియాపైనే పెట్టింది. యూట్యూబ్‌ చానెల్‌ ఒపెన్‌ చేసి.. తన కుటుంబం, పిల్లలు, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ.. వాటిని పోస్ట్‌ చేసేది. కాగా తాజాగా లాస్య పోస్ట్‌ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఆమె తన భర్త మంజునాథ్‌ చేతిలో దెబ్బలు తింటుంది.

ఈ వీడియో చూసిన వారు షాక్‌ అవుతున్నారు. మంజునాథ్‌, లాస్యలది ప్రేమ వివాహం.. పైగా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. అలాంటిది మంజునాథ్‌ లాస్యను కొట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు. మరి ఇంతకు ఏం జరిగింది.. మంజునాథ్‌ ఎందుకు లాస్య మీద చేయి చేసుకున్నాడు అంటే.. వీరిద్దరూ నిజంగా గొడవపడలేదు. ఓ ఫన్నీ రీల్‌ చేస్తూ.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది లాస్య.

‘మీది మొత్తం థౌసెండ్‌.. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అంటూ కుమారి ఆంటీ చెప్పిన డైలాగ్‌ ఎంత వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో బోలేడు మీమ్స్‌ వచ్చాయి. ఇక ఈ ఫన్నీ డైలాగ్‌తో లాస్య, మంజునాథ్‌ రీల్‌ చేశారు. భర్తకు చేపల కూర వడ్డించిన లాస్య.. మీది మొత్తం థౌసండ్‌.. ఎక్ట్రా రెండు లివర్లు అని చెప్పింది. ఆ మాటలకు మంజునాథ్‌.. కోపంతో లాస్య మీదకు కుర్చి ఎత్తాడు. ఈ వీడియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది లాస్య.

జస్ట్‌ ఫర్‌ ఫన్‌.. మీరు ఇష్టపడతారని భావిస్తుస్తున్నాను.. అంటూ ఈ వీడియోకి క్యాప్షన్‌ జత చేసింది లాస్య. ఇక ఈ భార్యాభర్తలిద్దరూ చేసిన ఈ రీల్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఒక్క నిమిషం నిజంగానే భయపెట్టారు అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. ప్రస్తుతం లాస్య బుల్లితెరకు దూరంగా ఉంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lasya Manjunath (@lasyamanjunath)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio