iDreamPost
android-app
ios-app

యాంకర్ ఝాన్సీ సీన్ వైరల్! కోకాపేట ఆంటీ 15ఏళ్ళ కిందే చెప్పేసిందా..!

  • Author ajaykrishna Updated - 10:20 AM, Fri - 4 August 23
  • Author ajaykrishna Updated - 10:20 AM, Fri - 4 August 23
యాంకర్ ఝాన్సీ సీన్ వైరల్! కోకాపేట ఆంటీ 15ఏళ్ళ కిందే చెప్పేసిందా..!

కోకాపేట.. ఓవర్ నైట్ లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకో తెలుసు కదా.. ప్రస్తుతం కోకాపేటలో భూమి ధర రికార్డు స్థాయికి చేరింది. ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లు దాటడమే అందుకు కారణం. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ రంగంలో కోకాపేటలోని భూముల ధరలను ఓ సంచలనం అని చెప్పుకుంటున్నారు. అయితే.. కోకాపేట భూముల గురించి పదిహేనేళ్ల క్రితమే ఓ సినిమాలో చూపించేశారంటూ ఓ కామెడీ సీన్ వైరల్ గా మారింది. తెలుగు ప్రేక్షకులకు యాంకర్ ఝాన్సీ గురించి పరిచయం అక్కర్లేదు. యాంకర్ గానే కాకుండా నటిగాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, మంచి క్యారెక్టర్స్ చేసి అలరించింది. ఆమె చేసిన క్యారెక్టర్స్ లో ఒకటి కోకాపేట ఆంటీ.

కామెడీ.. గయ్యాళి క్యారెక్టర్స్ లో ఝాన్సీకి మంచి పేరుంది. ఒకప్పుడు ఝాన్సీ ఓ కామెడీ సీన్ లో చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన తులసి సినిమాలో.. ఝాన్సీ కోకాపేట ఆంటీ క్యారెక్టర్ చేసింది. చాలా రిచ్ కోకాపేట ఆంటీగా ఝాన్సీ ఆ సినిమాలో.. “కోకాపేటలో ఒక ఎకరం అమ్మితే యాడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోనుండి పదిలచ్చలు తీసి ఈ చీర, నగలు కొన్నాడు మా ఆయన’ అని కామెడీగా డైలాగ్ చెప్పింది. దాదాపు 15 ఏళ్ళ క్రితమే చెప్పిన ఆ డైలాగ్.. ఇప్పుడు నిజంగా కోకాపేట భూముల వేల్యూకు సరిగ్గా సరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ లో మాట్లాడుకుంటున్నారు.

అదిగాక ఝాన్సీ చేసిన కామెడీ సీన్ ని అందరితో షేర్ చేస్తూ.. నెట్టింట వైరల్ చేసేస్తున్నారు. అసలు అన్నేళ్ల కిందటే ఎలా చెప్పేశారు.. అని ఫన్నీగా డిస్కషన్స్ మొదలు పెట్టేశారు నెటిజన్స్. ప్రస్తుతం తులసి సినిమాలోని కోకాపేట ఆంటీ క్యారెక్టర్.. తాజా కోకాపేట రియల్ ఎస్టేట్ ధరల కారణంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఎకరం ధర రూ. 100 కోట్లు డాటడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సినిమాలో డైలాగ్ విని నవ్వుకున్నవారు.. ఇప్పుడు అవే మాటలు నిజమయ్యే సరికి ముక్కున వేలేసుకుంటున్నారని సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు కొందరు. మరి కోకాపేట భూముల వేల్యూ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş