iDreamPost
android-app
ios-app

డైరెక్టర్ సూర్య కిరణ్ మరణంపై దేవీ నాగవల్లి ఎమోషనల్ పోస్ట్..!

  • Published Mar 11, 2024 | 6:33 PM Updated Updated Mar 11, 2024 | 8:52 PM

Devi Nagavalli Emotional Post: ప్రముఖ నటుడు, డైరెక్టర్ సూర్య కిరణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Devi Nagavalli Emotional Post: ప్రముఖ నటుడు, డైరెక్టర్ సూర్య కిరణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

  • Published Mar 11, 2024 | 6:33 PMUpdated Mar 11, 2024 | 8:52 PM
డైరెక్టర్ సూర్య కిరణ్ మరణంపై దేవీ నాగవల్లి ఎమోషనల్ పోస్ట్..!

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, కొరియోగ్రఫర్, దర్శకుడు సూర్య కిరణ్ సోమవారం చెన్నైలో కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు.. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సూర్య కిరణ్ కొరియోగ్రాఫర్, రచయితగా మారారు. తర్వాత డైరెక్షన్ రంగంలోకి అడుగు పెట్టి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. స్టార్ హీరోలతో నటించిన ఆయన దాదాపు 200 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్య కిరణ్ మరణంతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సూర్య కిరణ్ సోమవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా టీవీ యాంకర్, న్యూస్ ప్రజంటర్ దేవి నాగవల్లి ఎంతో ఎమోషన్ అయ్యారు. గొప్ప నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరి హృదయాలను కలచి వేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఇమె ఇన్‌స్ట్రాలో సూర్య కిరణ్ కి శ్రద్దాంజటి ఘటిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దేవి నాగవల్లి. 2020లో బిగ్ బాస్ సీజన్ 4 లో సూర్యకిరన్, దేవి నాగవల్లి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఉండేది. మొదటి వారం సూర్య కిరణ్ ఎలిమినెట్ అయి బయటకు వచ్చారు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య కిరణ్ అనూహ్యంగా తొలివారం బయటకు రావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూర్య కిరణ్ ఇంటి సభ్యుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీవీ 9 యాంకర్ నాగవల్లి గురించి తనకు పెద్దగా తెలియదని.. బిగ్ బాస్ హౌజ్ లో ఆమె చాలా మెచ్యూర్ పర్సన్ గా కనిపించారని అప్పట్లో కొనియాడారు. ఆమె ఎంతో మనోధైర్యం కలిగిన వ్యక్తి అని.. అనుకున్నది సాధించడానికి ఎంతో కష్టపడే నైజం ఉన్న మహిళ అని అన్నారు. ఖచ్చితంగా ఆమె టాప్ 5 లో ఉంటారనే నమ్మకం తనకు ఉందని అప్పట్లో అన్నారు. బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత సూర్య కిరణ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. వరుస ఫెయిల్యూర్స్, ఆర్ధికంగా చితికిపోవడం, ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి కళ్యాణితో విడిపోవడం, అనారోగ్యం ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రెష్ లోకి వెళ్లడం జరిగిందని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకొని బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్య కిరణ్ మరణ వార్త ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

 

View this post on Instagram

 

A post shared by Devi Nagavalli (@devi_nagavalli)


Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet