iDreamPost
android-app
ios-app

పుష్ప 2 క్రేజ్ వేరే లెవెల్.. ప్రతి సీన్ క్లైమాక్స్ !

  • Published Oct 29, 2024 | 10:35 AM Updated Updated Oct 29, 2024 | 10:35 AM

Pushpa 2 Movie Updates: ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ పుష్ప 2 కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఈ క్రమంలో రోజు రోజుకి ఈ సినిమా మీద క్రేజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా అనసూయా ఓ ఈవెంట్ లో చెప్పిన మాటలకు ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Pushpa 2 Movie Updates: ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ పుష్ప 2 కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఈ క్రమంలో రోజు రోజుకి ఈ సినిమా మీద క్రేజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా అనసూయా ఓ ఈవెంట్ లో చెప్పిన మాటలకు ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 29, 2024 | 10:35 AMUpdated Oct 29, 2024 | 10:35 AM
పుష్ప 2 క్రేజ్ వేరే లెవెల్.. ప్రతి సీన్ క్లైమాక్స్ !

తెలుగు మూవీ లవర్స్ తో పాటు.. ఇండియన్ మూవీ లవర్స్ అంతా కూడా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమాపై క్రియేట్ అవుతున్న హైప్ కు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లు బద్దలయ్యేలా ఉన్నాయి. ఇంకా ప్రీ బుకింగ్స్ స్టార్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ వదిలిన తర్వాత ఒక్కసారి ప్రీ బుకింగ్స్ మొదలైతే కానీ.. అసలు కథ మొదలు కాదు. మొదటి పార్ట్ రిలీజ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కానీ.. స్లో గా జనాలకు ఎక్కేసింది. ఇప్పుడు అది స్పీడ్ పాయిజన్ గా మారి పుష్ప 2 మీద హైప్ క్రియేట్ చేసింది. పుష్ప దెబ్బకు అందరు వణికిపోతున్నారు. ఎలాంటి సునామి సృష్టిస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా రాజమౌళి లేకుండా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. చెప్పినట్లుగానే బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాడా అనే కంగారు అభిమానులలో కూడా ఉంది.

ఇంకా షూటింగ్ కూడా పూర్తికాలేదు. కానీ , సినిమా మాత్రం ఓ రోజు ముందే రిలీజ్ చేస్తాం అన్నారు. ఇలా పుష్ప నుంచి రోజుకు ఓ వార్తా సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడనే టాక్ కూడా ఉంది . కానీ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. హీరోగా పుష్ప ఈసారి ఎలా ఉండబోతున్నాడు.. విలన్ గా చేస్తున్న ఫాహద్ ఫాజిల్ రోల్ ఎలా ఉండబోతుంది.. అనసూయ సునీల్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి. ఇలా ప్రతి దాని మీద ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. దానికి తోడు తాజాగా ఓ షో లో అనసూయ చెప్పిన మాటలు .. ఇంకాస్త ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. పుష్ప 2 లో పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని.. ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపిస్తుందని.. పార్ట్ 1 లో అసలు సినిమానే లేదని.. సినిమా అంతా కూడా పార్ట్ 2 లోనే ఉందని అనసూయ చెప్పుకొచ్చింది.

దీనితో ఈ మాటలు సోషల్ మీడియాలో ఇంకాస్త బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాతో పుష్ప రాజ్ ఎరా స్టార్ట్ అవ్వబోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పుష్ప టీం అంతా కూడా ప్రమోషన్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉంది. దాదాపు వచ్చే వారానికి షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. అదిరిపోయే ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు . అలాగే సినిమా రిలీజ్ లోపు ఐటెం సాంగ్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇలా రోజు రోజుకు కొత్త అప్డేట్స్ విడుదల చేస్తూ.. పుష్ప 2 మూవీ ప్రేక్షకులను ఊరిస్తుంది. ఇక రానున్న రోజుల్లో  ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet