Krishna Kowshik
Anasuya Bharadwaj: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన అత్యాచార కేసులో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాాాజాగా ఈ జాబితాలోకి చేరింది అనసూయ భరద్వాజ్. ఆమె ఏమన్నదంటే..?
Anasuya Bharadwaj: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన అత్యాచార కేసులో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాాాజాగా ఈ జాబితాలోకి చేరింది అనసూయ భరద్వాజ్. ఆమె ఏమన్నదంటే..?
Krishna Kowshik
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. తనను పని ప్రదేశాల్లో అత్యాచారానికి ఒడిగట్టాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో రేప్‌తో పాటు పలు కేసులు నమోదు అయ్యాయి. ముంబయి, చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో తనపై లైంగిక దాడి చేశాడని, చివరకు క్యారవాన్‌లో కూడా తన పైత్యాన్ని ప్రదర్శించాడని తెలిపింది బాధితురాలు. మతం మార్చుకోవాలని, పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బంది పెట్టాడని కంప్లయింట్‌లో పేర్కొంది. మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా పని ఇవ్వకుండా బాధపెట్టాడని, బెదిరిస్తున్నాడని తెలిపింది. జానీ మాస్టర్ మాత్రమే కాదు.. ఆయన భార్య కూడా తన ఇంటికి వచ్చి దాడి చేశారంటూ వాంగూల్మం ఇచ్చింది. ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా అనసూయ భరద్వాజ్ రియాక్ట్ అయ్యింది.
‘ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధకు నేను నిజంగా చింతిస్తున్నాను. మహిళలు, అమ్మాయిలు తమకు ఎదురౌతున్న ఇబ్బందికర పరిస్థితులు చెప్పేందుకు చాలా టైం తీసుుకోవడం బాధగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తక్షణమే చెప్పాలి. ఇలా చేస్తే సానుభూతి పొందడం కన్నా సమగ్రతను ప్రశ్నించేలా చేస్తుంది. నేను ప్రతి ఒక్కరికీ చెప్పేది ఒకటే.. అసౌకర్యంగా, అగౌరవం అనిపించినప్పుడు దాన్ని దాచి పెట్టకుండా బయటకు చెప్పండి. దీని వల్ల మీ తర్వాత వచ్చే తరాలకు కూడా సాయం చేసిన వాళ్లు అవుతారు. నేను బాధిత యువతతో కలిసి కొద్ది రోజులు పని చేశాను. అమ్మాయి ‘పుష్ప’ సెట్స్‌లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. మంచి టాలెంట్ ఉన్న అయ్యాయి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఒకరికొకరు మన నిలబడాల్సిన అవసరం, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పని ప్రదేశాల్లో తోటి మహిళలకు ఇబ్బందులు ఎదురైతే నేను స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడతాను. బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్‌తో పాటు వోడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక వర్క్ ప్లేసులో మహిళలందరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురు కావని ఆశిస్తున్నా’ అంటూ ఇన్ స్టా స్టోరీలో పేర్కొంది. కాగా, ఇప్పటికే చిన్మయి, పూనమ్ కౌర్ వంటి సినీ సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలిచిన సంగతి విదితమే. అలాగే అల్లు అర్జున్ సైతం ఆమెకు మద్దతుగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు తన సినిమాల్లో ఛాన్స్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది.