iDreamPost
android-app
ios-app

ఆనంద్ లవ్ బ్రేకప్.. మూవీలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా..!

  • Published Feb 10, 2024 | 9:50 PM Updated Updated Feb 10, 2024 | 9:50 PM

Anand Love Breakup Story: ఆనంద్ దెేవరకొండ బేబీ సినిమాలో భగ్న ప్రేమికుడిగా మెప్పించాడు. అయితే రియల్ లైఫ్ లో కూడా తాను భగ్న ప్రేమికుడినే అంటున్నాడు.

Anand Love Breakup Story: ఆనంద్ దెేవరకొండ బేబీ సినిమాలో భగ్న ప్రేమికుడిగా మెప్పించాడు. అయితే రియల్ లైఫ్ లో కూడా తాను భగ్న ప్రేమికుడినే అంటున్నాడు.

  • Published Feb 10, 2024 | 9:50 PMUpdated Feb 10, 2024 | 9:50 PM
ఆనంద్ లవ్ బ్రేకప్.. మూవీలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా..!

ప్రేమ అనేది ఒక మధురానుభూతి. అందరి జీవితంలో ఒక్కసారైనా ఆ ఫీలింగ్ ని ఎక్స్ పీరియన్స్ చేసే ఉంటారు. అయితే లైఫ్ లై ఫస్ట్ లవ్ ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ లవ్ సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా సరే.. చిరకాలం గుర్తుండిపోతుంది. లవ్ బ్రేకప్ అయితే మాత్రం ఆ బాధ నుంచి బయటపడటానికి కొన్నేళ్లు పడుతుంది. అలాంటి ఒక ఫేజ్ తన లైఫ్ లో కూడా ఉంది అంటున్నాడు.. కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ. ఎంతో నిజాయితీగా ప్రేమిస్తే వర్కౌట్ కాలేదన్నాడు. ఆ బాధ నుంచి బయటపడేందుకు అతనికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది అంటూ మొదటిసారి తన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు.

ఆనంద్ దేవరకొండ ఇంటీవల బేబీ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు అందుకున్నాడు. ఆ మూవీలో గాఢంగా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదని.. జుట్టు, గడ్డం పెంచుకుని ఒక పిచ్చివాడిలా మారిపోతాడు. ఆ మూవీలో ఆనంద్ దేవరకొండ నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. అందరూ అతడి యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. అయితే అతను అంత బాగా నటించాడనికి తన రియల్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉపయోగపడిందని తాజాగా తెలిసింది. అతని లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. తన జీవితాన్నే ఆ క్యారెక్టర్ లో ఊహించుకుని ఆనంద్ యాక్ట్ చేశాడేమో అని ఈ కామెంట్స్ వింటే అర్థమవుతోంది.

తన బ్రేకప్ గురించి ఆనంద్ దేవరకొండ ఏం చెప్పాడంటే.. “నా ఫస్ట్ లవ్ స్టోరీ.. నేను ప్రేమించిన అమ్మాయి హయ్యర్ స్టడీస్ కోసం చికాగో వెళ్లింది. నేను కూడా అమెరికా వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చికాగో చుట్టుపక్కన యూనివర్సిటిలో జాయిన్ అయితే సరిపోతుంది అనుకున్నాను. అలాగే 5 టాప్ యూనివర్సిటీలకు అప్లయ్ చేశాను. నాకు సీటు కూడా వచ్చింది. ఇంకేముంది లైఫ్ మొత్తం మారిపోతుంది. ఎంచక్కా అక్కడ ఎంజాయ్ చేయచ్చు అనుకున్నాను. మా లవ్ స్టోరీకి ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు ఉండవు అనుకున్నాను. అక్కడికి వెళ్లాక అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి. మొత్తం వ్యవహారం బెడిసికొట్టింది. నాకు ఏమీ అర్థం కాలేదు. నా గుండె బద్ధులైనంత పని అయిపోయింది. ఎంతో నిజాయితీగా ప్రేమించాను. కానీ, వర్కౌట్ కాలేదు. ఆ బాధ నుచి బయటకు రావడానికి నాకు ఏకంగా నాలుగేళ్లు పట్టింది” అంటూ ఆనంద్ దేవరకొండ తన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ఆనంద్ దేవరకొండ అమెరికాలో ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.40 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా బేబీ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి.. ఆనంద్ దేవరకొండ బ్రేకప్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş