iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి అమీ జాక్సన్‌ యాక్షన్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడ.. ఎప్పుడంటే?

  • Published Feb 25, 2024 | 4:31 PM Updated Updated Feb 25, 2024 | 4:31 PM

రామ్ చరణ్ ఎవడు మూవీలో గ్లామర్ షోతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన నటి అమీ జాక్సన్ కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల మీషన్ చాప్టర్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.

రామ్ చరణ్ ఎవడు మూవీలో గ్లామర్ షోతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన నటి అమీ జాక్సన్ కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల మీషన్ చాప్టర్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.

  • Published Feb 25, 2024 | 4:31 PMUpdated Feb 25, 2024 | 4:31 PM
ఓటీటీలోకి అమీ జాక్సన్‌ యాక్షన్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడ.. ఎప్పుడంటే?

ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే ధియేటర్లకు వెళ్లి చూసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మంది కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. అప్పట్లో కరోనా సమయంలో ధియేటర్లో మూసి వేయడంతో చాలా మంది ఓటీటీకి అలవాటు పడ్డారు.. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఓటీటీలో శుక్రవారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. కొన్ని మూవీస్ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా అందాల భామ అమీ జాక్సన్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. వివరాల్లోకి వెళితే..

ఎవడు మూవీలో రామ్ చరణ్ సరసన నటించిన బిట్రన్ బ్యూటీ అమీ జాక్సన్ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమ వ్యవహారాలు.. తల్లిగా మారిన అమీ జాక్సన్ దాదాపు ఆరేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవల ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కోలీవుడ్ మూవీ మిషన్ చాప్టర్ వన్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో హీరోగా అరుణ్ విజయ్ నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మించారు. వాస్తవానికి సంక్రాంతికి తెలుగు లో రిలీజ్ చేయాలని భావించినా.. అప్పటికే నాలుగు సినిమాలు లైన్లో ఉండటంతో తమిళ్ లోనే రిలీజ్ చేశారు.

మిషన్ చాప్టర్ వన్ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. నెట్ ప్లిక్స్ లో ఈ యాక్షన్ మూవీ త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 1 న ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ కు మేళవించి ఏఎల్ విజయ్ ఈ మూవీ తెరకెక్కంచారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఓ బడా హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్న తన కూతురిని కలుసుకోవడానికి జైలులో ఉన్న ఖైదీ ఎలాంటి పోరాటాలు చేయాల్సి వస్తుంది? విదేశీ జైల్లో ఖైదీగా మారడానికి గల కారణం ఏంటీ? అన్నదే మూల కథ. ఈ మూవీలో అమీ జాక్సన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఇందులో సజయన్ మరో హీరోయిన్ కూడా నటిస్తుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş