iDreamPost
android-app
ios-app

దర్శకుడి ప్రేమలో హీరోయిన్.. ఎట్టకేలకు చెప్పేసిందిగా

  • Published Jun 11, 2024 | 6:37 PM Updated Updated Jun 11, 2024 | 6:37 PM

సినీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మరికొందరు తమ ఎంగేజ్ మెంట్, రిలేషన్ విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ బ్యూటీ ప్రేమలో పడగా.. ఆ విషయాన్ని వెల్లడించింది.

సినీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మరికొందరు తమ ఎంగేజ్ మెంట్, రిలేషన్ విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ బ్యూటీ ప్రేమలో పడగా.. ఆ విషయాన్ని వెల్లడించింది.

  • Published Jun 11, 2024 | 6:37 PMUpdated Jun 11, 2024 | 6:37 PM
దర్శకుడి ప్రేమలో హీరోయిన్.. ఎట్టకేలకు చెప్పేసిందిగా

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం సహజం. అలాగే డైరెక్టర్, హీరోయిన్ మధ్య లవ్ చిగురించి.. పెళ్లి పీటలు వరకు చేరుతుంది. సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు డైరెక్టర్లను మనువాడిన సంగతి విదితమే. రోజా-సెల్వమణి, రమ్యకృష్ణ- కృష్ణ వంశీ, సుహాసినీ-మణిరత్నం, శ్రీదేవి విజయ్ కుమార్- హరి సక్సెస్ ఫుల్ స్టోరీస్ కాగా, అమలా పాల్-విజయ్, సోనీ అగర్వాల్-సెల్వ రాఘవన్, లిజీ-మలయాళ దర్శకుడు ప్రియదర్శన్.. కొన్ని సంవత్సరాల కాపురం తర్వాత విడిపోయారు. ఇప్పుడు మరో నటి దర్శకుడితో ప్రేమలో పడిపోయింది. ఎట్టకేలకు వారి సీక్రెట్ లవ్ బయటపెట్టింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే అమ్ము అభిరామి.

తెలుగు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న చెన్నై భామ అమ్ము అభిరామి. కాగా, ఇప్పుడు ఈ అమ్మడు ప్రేమను తెలియజేస్తూ ఓ పోస్టు పెట్టింది. టీవీ సెలబ్రిటీ, ప్రొగ్రామ్ ప్రొడ్యూసర్, క్రియేటివ్ డైరెక్టర్ పార్థివ్ మణికి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టు పెట్టింది. అందులో హ్యాపీ బర్త్ డే  పార్టీవ్.. ‘పుట్టినందుకు.. నా జీవితంలోకి రాబోతున్నందుకు ధాంక్యూ’ అంటూ పోస్టు పెట్టింది. దీంతో ఆమెకు కంగ్రాట్స్  చెబుతూ విషెస్ తెలియజేస్తున్నారు.  తన సీక్రెట్ లవ్ స్టోరీని బయటపెట్టింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమ్ము అభిరామి.. ఇళయదళపతి విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన భైరవలో  మెడికల్ కాలేజీ విద్యార్థిని పాత్రలో నటించింది. ఆ తర్వాత కార్తీ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తీరన్ అకాహమీర్ ఉడు’లో కార్తీకి చెల్లెలుగా నటించింది.  కానీ ఆమెకు గుర్తింపు తెచ్చింది  రాక్షసన్. ఇందులో అమ్ము అభిరామి స్కూల్‌ విద్యార్థినిగా యాక్ట్ చేసింది.

‘అసురన్’లో ధనుష్ మాజీ ప్రియురాలు.. మరియమ్మ పాత్ర పోషించింది.  ఆ సినిమా రీమేక్‌లో నారప్పలో కన్నమ్మగా  కనిపించింది. . ప్రస్తుతం తమిళం-తెలుగు రెండు భాషల్లోనూ నటిగా బిజీ బిజీగా ఉంది అమ్ము అభిరామి.  తెలుగులో రణస్థలి, డెవిల్ వంటి చిత్రాలతో పలకరించింది. ఇటీవల విడుదలైన హాట్ స్పాట్ కూడా మంచి స్పందన వచ్చింది.   కుక్ విత్ కోమలి షో ద్వారా అమ్ము  వెండితెరపైనే కాకుండా స్మాల్ స్క్రీన్ అభిమానులకు కూడా బాగా తెలుసు. ఆ షోలో దర్శకుడు పార్థీవ్ మణితో ప్రేమలో ఉన్నానని ఇదివరకే చెప్పగా, ఇప్పుడు.. మణి బర్త్ డే సందర్బంగా ఆ సమాచారాన్ని కన్ఫర్మ్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdumanbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio