iDreamPost
android-app
ios-app

ఆస్పత్రిలో చేరిన అమితాబచ్చన్.. కారణం అదేనా?

  • Published Mar 15, 2024 | 2:35 PM Updated Updated Mar 15, 2024 | 2:35 PM

Amitabh Bachchan Admitted Hospital: బాలీవుడ్ మెగాస్టార్, జాతీయ నటుడు అమితాబచ్చన్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Amitabh Bachchan Admitted Hospital: బాలీవుడ్ మెగాస్టార్, జాతీయ నటుడు అమితాబచ్చన్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

  • Published Mar 15, 2024 | 2:35 PMUpdated Mar 15, 2024 | 2:35 PM
ఆస్పత్రిలో చేరిన అమితాబచ్చన్.. కారణం అదేనా?

సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ అమితా బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన బిగ్ బీ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు. నటుడిగానే కాకుండా టెలివిజన్ చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తో బాగా పాపులర్ అయ్యారు. నటుడిగా, హూస్ట్ గా సామాజిక కార్యకర్తగా అన్ని రంగాల్లో తనదైన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏళ్లు.. అయినా కుర్ర హీరోలతో పోటీగా నటిస్తున్నారు. తాజాగా అమితాబచ్చన్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.. ఎందుకు ఆయన ఆస్పత్రిలో చేరారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

భారతీయ చలన చిత్ర రంగంలో మెగాస్టార్ అమితాబ్ అమితాబచ్చన్ తనదైన ముద్ర వేశారు. ఆయన వయసు 81 ఏళ్లు అయినా.. ఎంతో యాక్టీవ్ గా ఉంటూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. తాజాగా అమితా బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు బీ టౌన్ లో టాక్. అమితాబ్ భుజం నొప్పి కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా బిగ్ బి‘X’లో , ‘T 4950-ఎప్పటికీ కృతజ్ఞతతో.’అంటూ పోస్ట్ చేశారు. అదే విధంగా ‘T 4950 – ఆంఖ్ ఖోల్కే దేఖ్ లో, కాన్ లగాకే సున్ లో, మాఝా ముంబై కి హోగీ జై జైకార్, యే బాత్ అబ్ మాన్లో,’అంటూ మ్యాచ్ సమయంలో కొడుకు అభిషేక్ బచ్చన్‌తో కొన్ని జ్ఞాపకాలకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు.

ఈ ఏడాది ప్రారంభంలో అమితా బచ్చన్ మణికట్టు శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఫోటోలు షేర్ చేశారు. కరోనా సమయంలో కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆయన ఏ కారణం తో హాస్పిటల్ లో చేరారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. . అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు. కొంతమంది సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆయన తరుచూ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వెళ్తుంటారని అంటున్నారు. ప్రస్తుతం అమితాబచ్చన్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొని హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ ఆస్పత్రిలో చేరిన వార్త తెలిసిన తర్వాత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలిన భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş