iDreamPost
android-app
ios-app

టీవీ షోలతో కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

  • Published Aug 03, 2024 | 4:35 PM Updated Updated Aug 03, 2024 | 5:23 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా..? మూడు ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తూ బిజీగా మారిపోయిన స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా..? మూడు ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తూ బిజీగా మారిపోయిన స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Aug 03, 2024 | 4:35 PMUpdated Aug 03, 2024 | 5:23 PM
టీవీ షోలతో కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో మంది నటీమణులను లైఫ్ ఇచ్చింది. తెలుగు అమ్మాయిలే కాకుండా కేరళ కుట్టీలు, కన్నడ కస్తూరీలు, తమిళ పొన్నులు, ఢిల్లీ డాల్స్, ముంబయి గర్ల్స్ తమ నటనతో ఆకట్టుకున్నారు. బ్యూటీస్ ఎక్కడా కనిపించినా టాలీవుడ్‌కు పట్టుకు వచ్చేయాల్సిందే దర్శక నిర్మాతలు. ప్రతి ఏడాది వందలాది భామలు పరిచయం అవుతున్నారు. తమ లక్ పరీక్షించుకుంటున్నారు. కొంత మంది హీరోయిన్లు.. అర కొర సినిమాలు చేసి తిరిగి తమ ఇండస్ట్రీకి వెళ్లిపోయి సత్తా చాటుతున్నారు. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ స్థాయి పెరిగిపోవడంతో ఇక్కడే వర్క్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఒకే పరిశ్రమలో గిరిగీసుకుని కూర్చోవడం లేదు. రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ.. చేతి నిండా సినిమాలతో బిజీ అవుతున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని చూశారు కదా.. ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా మూడు ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తూ స్టార్ నటిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో చూస్తుంటే నటనను అప్పటి నుండే వంట పట్టించుకున్నట్లు ఉంది కదా. అందుకేనేమో కళా రంగం వైపు అడుగులు వేసినట్లు ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో అందులోనూ సీనియర్ సూపర్ స్టార్లతో వర్క్ చేసే అవకాశాన్ని కొల్లగొట్టింది. రష్మికలానే ఆమె కూడా చందన సీమ నుండే కాలు పెట్టింది. ఈ బ్యూటీకి ఎవరంటే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ ఆషికా రంగనాథ్.

కర్ణాటక తమకూరు ప్రాంతానికి చెందిన ఆషికా.. చిన్నప్పుడు టీవీల్లో పలు డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇప్పుడు చూస్తున్న ఫోటో అప్పటిదే. కాలేజీకి వచ్చాక అందాల పోటీల్లో పాల్గొనేది. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌ నిలిచింది. ఆమె అక్క అనూష రంగనాథ్ కూడా నటే. ఆమె నుండి నటనను వారసత్వంగా తీసుకుని కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చింది ఆషికా. క్రేజీ బాయ్ మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ తొలుత స్మాల్ రోల్స్‌లో కనిపించింది. రాంబో2 తర్వాత మళ్లీ పుంజుకుంది. మదగజ, అవతార పురుష, గరుడ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే పలు సినిమాల్లో క్యామియోగా అలరించింది.

aashika ranganadhan child hood pic 1

పట్టాత్తు ఆర్సన్ అనే మూవీత తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా.. గత ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆకట్టుకోకపోయినప్పటికీ.. ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు నా సామి రంగా చిత్రంలో నాగార్జున సరసన యాక్ట్ చేసింది. వాట్ ఎ బ్యూటీ అనిపించుకుంది.  మెగాస్టార్ చిరంజీవి మూవీ విశ్వంభరలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా కన్నడలోనూ, అటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అమ్మడు అందంతో పాటు యాక్టింగ్ కూడా ఇరగదీస్తుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కాబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashiiii forever <3💎 (@ashikaa_admirer)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş