iDreamPost
android-app
ios-app

ఓటిటిలపై హీరోయిన్ అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్!

  • Author ajaykrishna Published - 04:13 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 04:13 PM, Sat - 8 July 23
ఓటిటిలపై హీరోయిన్ అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం కొన్నిసార్లు ఎలాంటి కామెంట్స్ అయినా చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఓవైపు సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నా.. పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ రచ్చ లేపుతుంటారు. కొద్దిరోజులుగా తనపై విమర్శలు వస్తున్నా.. అవేమి పట్టించుకోకుండా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కింది సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్. ఈ భామకి విమర్శలు కొత్త కాదు.. కానీ రీసెంట్ గా ‘గదర్ 2’ మూవీ ప్రమోషన్స్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కంపై ఇటీవల అమీషా చేసిన ఘాటైన కామెంట్స్ ఇండస్ట్రీలో హీటెక్కిస్తున్నాయి.

అంతేగాక ఓటిటి వేదికలపై కూడా అమీషా షాకింగ్ కామెంట్స్ చేసింది. గదర్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో సమావేశామైన అమీషా.. ప్రేక్షకులు మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పుడున్న ఓటిటిలన్నీ స్వలింగ సంపర్కంతో(ఇంకా గే టైపు) కంటెంట్ తో నిండి ఉన్నాయనే విధంగా వ్యాఖ్యలను సమర్ధిస్తూ మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. ‘పేరెంట్స్ చైల్డ్ లాక్ లను ఉంచేలా ఓటిటిలు చేస్తున్నాయి. మంచి హెల్తీ కంటెంట్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. కానీ.. మనవడు తాత కలిసి చూసేలా సినిమాలు తీయగలిగే యుగం కనిపించడం లేదు.

ఓటిటిలు మీరు కోరుకునే కంటెంట్ ని ఇవ్వలేవు. ఈ మధ్యకాలంలో ఓటిటిలన్నీ స్వలింగ సంపర్కంతో కూడిన, గే, లెస్బియనిజం టైప్ కంటెంట్ ని చూపిస్తున్నాయి. మీరు పిల్లలతో సినిమాలు చూసేటప్పుడు పిల్లల కళ్ళను మూసి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి సన్నివేశాలను ఓటిటిలు ఎంకరేజ్ చేస్తున్నాయి. అందువల్ల పిల్లలను ఓటిటిలో సినిమాలు చూసేందుకు పేరెంట్స్ అనుమతి ఇవ్వలేరు.’ అమీషా చెప్పుకొచ్చింది. అయితే.. అమీషా వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా.. సోషల్ మీడియాలో మరికొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. లేటు వయసులో ఈ ముదురు బ్యూటీ ఓటిటిలపై కామెంట్స్ చేసి బజ్ క్రియేట్ చేసుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అమీషా పటేల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom