iDreamPost
android-app
ios-app

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ అధికారిక OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

  • Published Feb 27, 2024 | 9:14 AM Updated Updated Mar 14, 2024 | 4:56 PM

గతకొన్ని రోజులుగా హీరో సుహాస్ నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. ఇంతకి ఎప్పుడంటే..

గతకొన్ని రోజులుగా హీరో సుహాస్ నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Feb 27, 2024 | 9:14 AMUpdated Mar 14, 2024 | 4:56 PM
‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ అధికారిక OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకున్న వారిలో యంగ్ హీరో ‘సుహాస్’ కూడా ఒకరు. ఇప్పటికే ఆయన నటించిన ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అసలు ఈతరం యువతకు మెప్పించేలా మంచి కంటెంట్ ను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సుహాస్. కేవలం ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత హీరోగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా, ఇటీవలే సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో మరోసారి సినీ ప్రేక్షకులను పలకిరించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. కానీ, తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. ఇంతకి ఎప్పుడంటే..

ఇటీవలే సుహాస్ ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. కాగా, ఎలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరి 2న థియేటర్ లో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోయింది. కేవలం రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ.. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ. 8కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇక కొద్ది రోజులుగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ పై అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాగా, ఈ మూవీని ఆహా ఈరోజు అనగా ఫిబ్రవరి 29 నుంచే స్ట్రీమింగ్ చేస్తోంది. కానీ, ఈ సినిమాను చూసే ఆవకాశం ఒక్క ‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లకు  మాత్రమే వర్తిస్తుంది. అది కూడా రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే. ఈ సినిమా  ఆహా గోల్డ్ ఉన్న వారికి మాత్రమే వర్తించడంతో.. మిగతా సబ్‌స్క్రైబర్స్ ఈ సినిమాను చూడాలంటే ఒక్కరోజు ఆగాల్సిందే.  ఇక ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కాగా, ఇందులో సరసన శివాని నాగరం కథానాయికగా నటించగా..శరణ్య ప్రదీప్ కీలకపాత్ర పోషించింది.

అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే..అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో ఉండే సుహాస్.. తన అక్క శరణ్య ప్రదీప్ తో కలిసి చిరతపూడిలో నివసిస్తుంటాడు. ఆ ఊరిలో ఉండే నితిన్ ప్రసన్న వల్లే తన అక్కకు ఉద్యోగం వచ్చిందంటూ రూమర్స్ వినిపిస్తుంటాయి. అదే సమయంలో నితిన్ ప్రసన్న చెల్లెలు శివాని నాగారంతో సుహాస్ ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమకు ఎదురైన సవాళ్లేంటీ ?.. తన అక్క పై వచ్చిన పుకార్లను సుహాస్ ఎలా ఎదుర్కొన్నాడు ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా ఓటీటీలో చూసేయాల్సిందే. మరి, మార్చి 1న ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş