iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 7లోకి అమర్ దీప్.. ఎంటర్ టైన్మెంట్ మాములుగా ఉండదుగా!

బిగ్ బాస్ 7లోకి అమర్ దీప్.. ఎంటర్ టైన్మెంట్ మాములుగా ఉండదుగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి వినిపిస్తున్న ఒక్కో వార్త ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ షో సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభం అవుతుంది అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఇంకా ముందే స్టార్ట్ చేస్తారని వినిపించిన వార్త బుల్లితెర ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆగస్టు నెలలోనే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. జులై నెలాఖరుకు ప్రోమో కూడా రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో హోస్ట్ నాగార్జున ప్రోమో షూట్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేది ఎవరు అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే చాలా పేర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రభాకర్, కార్తీక దీపం మోనితా, బుల్లెట్ బండి సింగర్ మోహనా భోగరాజు, జబర్దస్త్ అప్పరావు ఇలా చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో పేరు చేరింది. ఈ పేరు వినగానే ప్రేక్షకుల్లో ఎనర్జీ రెట్టింపు అవుతోంది. ఎందుకంటే ఆ పేరు బుల్లితెర సెన్సేషన్ అమర్ దీప్ ది కాబట్టి. జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్ బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ టాక్ మొదలైంది.

 

View this post on Instagram

 

A post shared by Amardeep G (@amardeep_chowdary)

పైగా దాదాపుగా అతని ఎంట్రీ ఖరారు అయిపోయింది అని కూడా చెబుతున్నారు. అదే నిజమైతే హౌస్ లో ఎనర్జీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఎందుకంటే అమర్ దీప్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా. అంతేకాకుండా ఎక్కడున్నా తన చుట్టు ఉన్న వారిని నవ్విస్తూ ఉంటాడు. హైపర్ ఎనర్జటిక్ గా ఉంటాడు. అతను హౌస్ లోకి అడుగు పెడితే టైటిల్ ఫేవరెట్ కూడా అవుతాడని చెప్పచ్చు. లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన అమర్ దీప్ అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో అభిమానం. అందుకే అమర్ దీప్ పేరు వినపడగానే.. అతను తప్పుకుండా బిగ్ బాస్ లోకి రావాలి అంటూ కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official)

గత సీజన్ లో కూడా అమర్ దీప్ వస్తున్నాడు అన్నట్లుగా టాక్ వచ్చినా కూడా అతను రాలేదు. కాబట్టి ఈసారి తప్పకుండా అమర్ దీప్ బిగ్ బాస్ లోకి వస్తాడేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ లోకి దంపతులను కూడా పంపిస్తూ ఉంటారు. అలాగే అమర్ దీప్ కూడా భార్య తేజశ్విని గౌడతో కలిసి వస్తే ఇంకా బాగుంటుంది అంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎంటర్ టైన్మెంట్ డబుల్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అదే జరిగితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వీళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom