iDreamPost
android-app
ios-app

ప్రియుడితో అమలాపాల్‌ పెళ్లి.. వైరల్‌గా మారిన ఫొటోలు!

  • Published Nov 06, 2023 | 8:26 AM Updated Updated Nov 06, 2023 | 8:26 AM

ఆమె ముందు పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు. ఇందుకు ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాగా, అమలాపాల్‌కు ఇది రెండో వివాహం...

ఆమె ముందు పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు. ఇందుకు ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాగా, అమలాపాల్‌కు ఇది రెండో వివాహం...

  • Published Nov 06, 2023 | 8:26 AMUpdated Nov 06, 2023 | 8:26 AM
ప్రియుడితో అమలాపాల్‌ పెళ్లి.. వైరల్‌గా మారిన ఫొటోలు!

ప్రముఖ బహుభాషా హీరోయిన్‌ అమలాపాల్‌ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌తో ఆదివారం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కొచ్చిలోని ఓ చర్చిలో క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. పదిరోజుల క్రితం వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. పది రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుని, ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎంగేజ్‌మెంట్‌కు కొద్దిరోజుల ముందు అమలాపాల్‌ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఈ వేడుకల్లో జగత్‌ ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆమె ముందు పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు.

ఇందుకు ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాగా, అమలాపాల్‌కు ఇది రెండో వివాహం. అంతకు ముందు ఆమె ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరిద్దరికీ పెళ్లి జరిగింది. అయితే, వీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. 2017లో విడాకులు తీసుకుని దూరం అయ్యారు. తర్వాతినుంచి ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక, అమలా పాల్‌ సినిమా కెరీర్‌ విషయానికి వస్తే.. 2009లో వచ్చిన నీల తామర అనే మలయాళ సినిమాతో  ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

2011లో వచ్చిన ‘బెజవాడ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. టాలీవుడ్‌లో దాదాపు 4 సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. ద్విజ అనే సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటూ ఉండగా.. ఇంకో సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మరి, అమలా పాల్‌ ప్రియుడు జగత్‌ను పెళ్లి చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss